Movie News

అర్జున్ చక్రవర్తి… ఈ ట్రైలరేదో బాగుందే

కొన్నిసార్లు చిన్న సినిమాల టీజర్లు, ట్రైలర్లు ఆశ్చర్యపరుస్తుంటాయి. పేరున్న నటీనటులు, టెక్నీషియన్లు లేకపోయినా.. ఔట్ పుట్ గొప్పగా అనిపించి ఈ సినిమా ఏదో బాగున్నట్లుందే అనే ఫీలింగ్ కలుగుతుంది. ‘అర్జున్ చక్రవర్తి’ అనే చిన్న సినిమా ట్రైలర్ ఇలాగే ఆశ్చర్యపరుస్తోంది. విజయ రామరాజు అనే అప్‌కమింగ్ ఆర్టిస్టును పెట్టి విక్రాంత్ రుద్ర అనే కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రమిది. శ్రీను గుబ్బాల ప్రొడ్యూసర్. చిన్న సినిమా అయినా బాగానే ఖర్చు పెట్టి, కొన్నేళ్ల పాటు శ్రమించి ఈ సినిమా తీసింది చిత్ర బృందం. ఇప్పటికే కొన్ని చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డులు, ప్రశంసలు అందుకున్న సినిమా ఇది. ఈ నెల 29న ‘అర్జున్ చక్రవర్తి’ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ చేశారు.

ఒక కబడ్డీ క్రీడాకారుడి కథతో తెరకెక్కిన సినిమా ఇది. అనాథ అయిన ఒక కుర్రాడిని ఒక కబడ్డీ కోచ్ చేరదీసి అతణ్ని మేటి క్రీడాకారుడిగా తీర్చిదిద్దుతాడు. ఆటలో గొప్ప పేరు సంపాదించాక తన లాంటి ఛాంపియన్లను మరింత మందిని తయారు చేయడానికి అకాడమీ నెలకొల్పాలనుకుంటాడు అర్జున్. కానీ అతడి ప్రయత్నం ఫలించదు. మరోవైపు అతను ప్రేమించిన అమ్మాయి దూరమవుతుంది. దీంతో అతను తాగుడుకు బానిసై ఆటకు దూరమవుతాడు.

ఇక తన జీవితమే ముగిసిపోయిందనుకున్న దశలో తిరిగి ఆటలోకి వచ్చి మళ్లీ ఛాంపియన్ అనిపించుకోవడమే మిగతా కథ. తెలుగులో జెర్సీ, హిందీలో సుల్తాన్ లాంటి సినిమాలను గుర్తు చేసేలా సాగింది ఈ ట్రైలర్. తెలిసిన కథే అయినా.. సన్నివేశాలన్నీ ఇంటెన్స్‌గా ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో ఉండే క్వాలిటీ కనిపించింది. చాలా సిన్సియర్‌గా సినిమా తీశారనే ఫీలింగ్ కలిగించేలా ఉంది ట్రైలర్. హీరో ప్రాణం పెట్టి పని చేసినట్లున్నాడు. పాత్రకు తగ్గట్లుగా లుక్స్ మార్చుకోవడానికి పడ్డ కష్టం కనిపిస్తోంది. పెర్ఫామెన్స్ కూడా బాగుంది. మరి ట్రైలర్ లాగే సినిమా కూడా మెప్పించి టీం పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుందేమో చూడాలి.

This post was last modified on August 21, 2025 10:00 pm

Share

Recent Posts

సాయిపల్లవిని పెళ్లి చేసుకోవాలంటే…

హీరోలకైనా, హీరోయిన్లకైనా కెరీర్లో కొన్నేళ్లు గడవగానే కొన్ని డీఫాల్ట్ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. మీ పెళ్ళిఎప్పుడు.. మీకు కాబోయేవారికి ఎలాంటి లక్షణాలు…

2 minutes ago

ఆదర్శం మీద అందరి కళ్ళు

సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ తర్వాత సోలో హీరోగా వెంకటేష్ నటించిన సినిమా ఆదర్శ…

1 hour ago

అనవసరపు రాద్ధాంతం ఇప్పుడు ఎందుకు

సోషల్ మీడియా ఉంది కదాని బురద జల్లే వ్యవహారాలు ఈ మధ్య బాగా ఎక్కువైపోయాయి. ఎంతగా అంటే ఒకరిని లేదా…

2 hours ago

ఇకపై లంచం అడిగితే జైలే

అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేనిదే పనులు జరగడం లేదు. గతంలో రెవెన్యూ, రిజిస్ట్రార్,…

2 hours ago

విభజన ప్రేమకథతో శ్రీకాంత్ ఓదెల సినిమా

దసరాతో తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. న్యాచురల్ స్టార్ గా ఉన్న నానిని ఊర…

6 hours ago

ఆదుకుంటాం… ఏపీకి తెలంగాణ ఆప‌న్న‌హ‌స్తం!

ఏపీ తుపాను సహాయక చర్యలలో సాయం చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చింది. విద్యుత్‌ సిబ్బంది, సామగ్రి పంపేందుకు సిద్ధమైంది.…

6 hours ago