Movie News

కూలీ కలెక్షన్స్: బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజైన రెండు భారీ చిత్రాల్లో ‘కూలీ’ స్పష్టమైన పైచేయి సాధించింది. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే ‘వార్-2’ మీద ఈ చిత్రం ఆధిపత్యం చలాయించింది. ఇక రిలీజ్ రోజు, తొలి వీకెండ్లో కూడా ‘కూలీ’ డామినేషనే చూశాం. అలా అని ఆ సినిమాకు గొప్ప టాకేమీ రాలేదు. కానీ ‘వార్-2’తో పోలిస్తే కొంచెం బెటర్ అని మాత్రమే అన్నారు అందరూ. కానీ టాక్‌తో సంబంధం లేకుండా ఈ చిత్రం వసూళ్ల మోత మోగించింది. ఆ ఊపు చూస్తే ‘కూలీ’ బయ్యర్లందరినీ సేఫ్ జోన్లోకి తెచ్చేస్తుందని, లాభాలు కూడా వస్తాయని అనుకున్నారంతా. కానీ ‘కూలీ’ ఊపంతా వీకెండ్ వరకే పరిమితమైంది.

సోమవారం నుంచి డ్రాప్ ఊహించిందే కానీ.. అది అంచనాలను దాటిపోయింది. ఒకేసారి ఆక్యుపెన్సీలు 10-15 శాతానికి పడిపోయాయి. ఆదివారం హౌస్ ఫుల్స్‌తో రన్ అయిన సినిమా కాస్తా.. తర్వాత రోజుకు ఖాళీ థియేటర్లతో దర్శనమిచ్చింది. తెలుగు, తమిళం, హిందీ అని తేడా లేకుండా అన్ని భాషల్లోనూ ‘కూలీ’ కలెక్షన్లు బాగా డ్రాప్ అయిపోయాయి. యుఎస్‌లో సైతం సినిమా జోరు తగ్గిపోయింది.

ఆదివారం వరల్డ్ వైడ్ రూ.60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సినిమా.. ఇప్పుడు రోజుకు పది కోట్లు రాబట్టడానికి కూడా కష్టపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే షేర్ మరీ నామమాత్రంగా మారింది. మంచి లాభాలు వస్తాయని ఆశించిన బయ్యర్లు.. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అయితే చాలనుకుంటున్నారు. కొన్ని చోట్ల స్వల్ప నష్టాలు కూడా తప్పేలా లేవు. ఇక ‘వార్-2’ సినిమా అయితే తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా చల్లబడిపోయింది. కానీ హిందీలో మాత్రం ఓ మోస్తరుగా వసూళ్లు వస్తున్నాయి. ఓవరాల్ వసూళ్లలో ప్రస్తుతం ‘కూలీ’పై ‘వార్-2’నే కాస్త పైచేయి సాధిస్తోంది. ఈ వీకెండ్లో పెద్ద సినిమాలేవీ లేకపోవడం వల్ల రెండు చిత్రాలూ కాస్త పుంజుకుంటాయని ఆశిస్తున్నారు.

This post was last modified on August 21, 2025 2:28 pm

Share

Recent Posts

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

28 minutes ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

3 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

5 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

5 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

6 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

14 hours ago