Movie News

జడ్జీపై మామా డైలాగ్.. అక్షయ్ కోర్టుకు హాజరవ్వాల్సిందే

బాలీవుడ్‌లో అత్యంత పాపులర్ లీగల్ కామెడీ ఫ్రాంచైజ్ జాలీ ఎల్ఎల్బీ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. కానీ ఈసారి సినిమా ప్రమోషన్ కారణంగా కాదు, కోర్టు వివాదం వల్ల. ఇంకా థియేటర్లకు రాకముందే జాలీ ఎల్ఎల్బీ 3 సినిమా నేరుగా న్యాయస్థానం తలుపులు తట్టింది. పుణెలోని సివిల్ కోర్టు బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్, నటుడు అర్షద్ వార్సీ, దర్శకుడు సుభాష్ కపూర్‌లకు సమన్లు జారీ చేసింది. 

కారణం ఏమిటంటే.. సినిమాలో న్యాయవ్యవస్థను అవమానించేలా, న్యాయవాదులను సరదాగా చూపించేలా సన్నివేశాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా జడ్జీలను “మామా” అని పిలిచే డైలాగ్‌పై లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాజేద్ రహీమ్ ఖాన్ అనే లాయర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, ఈ కేసు అధికారికంగా మొదలైంది.

అక్టోబర్ 28 ఉదయం 11 గంటలకు సినిమా యూనిట్‌ కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. అసలు ఈ వివాదం 2024లోనే టీజర్ విడుదల తర్వాత మొదలైంది. అప్పట్లోనే కొంతమంది లాయర్లు సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేసు వేగంగా ముందుకు వెళ్లడంతో సినిమా రిలీజ్‌కు అడ్డంకులు వస్తాయా అనే అనుమానం కలుగుతోంది.

జాలీ ఎల్ఎల్బీ సిరీస్‌కి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. 2013లో అర్షద్ వార్సీ హీరోగా వచ్చిన మొదటి భాగం హిట్ కాగా, 2017లో అక్షయ్‌కుమార్ నటించిన రెండో భాగం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ ఇద్దరూ కలసి నటిస్తున్న మూడో భాగం సెప్టెంబర్ 19న విడుదల కానుంది. అయితే రిలీజ్‌కి ముందు ఈ కోర్టు కేసు కొత్త సవాల్‌గా మారింది.

ఫిర్యాదు దారుడు మాట్లాడుతూ, న్యాయవాదులు, జడ్జీల పట్ల గౌరవం ఉండాలని, సినిమాల్లో వారిని హాస్యాస్పదంగా చూపించడం సమాజంలో తప్పు సందేశం ఇస్తుందని స్పష్టం చేశారు. కోర్టు కూడా ఈ వాదనను సీరియస్ గా పరిగణించింది. దీంతో మేకర్స్‌కు చట్టపరమైన సవాల్ ఎదురైంది. ఇక అక్టోబర్ 28న అక్షయ్‌కుమార్, అర్షద్ వార్సీ, సుభాష్ కపూర్ కోర్టులో హాజరవుతారా లేదా అనేది చూడాలి.

This post was last modified on August 21, 2025 2:17 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Jolly LLB

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

1 hour ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

4 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

4 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

5 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

6 hours ago