బాలీవుడ్‌లో అత్యంత పాపులర్ లీగల్ కామెడీ ఫ్రాంచైజ్ జాలీ ఎల్ఎల్బీ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. కానీ ఈసారి సినిమా ప్రమోషన్ కారణంగా కాదు, కోర్టు వివాదం వల్ల. ఇంకా థియేటర్లకు రాకముందే జాలీ ఎల్ఎల్బీ 3 సినిమా నేరుగా న్యాయస్థానం తలుపులు తట్టింది. పుణెలోని సివిల్ కోర్టు బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్, నటుడు అర్షద్ వార్సీ, దర్శకుడు సుభాష్ కపూర్‌లకు సమన్లు జారీ చేసింది.
కారణం ఏమిటంటే.. సినిమాలో న్యాయవ్యవస్థను అవమానించేలా, న్యాయవాదులను సరదాగా చూపించేలా సన్నివేశాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా జడ్జీలను “మామా” అని పిలిచే డైలాగ్‌పై లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాజేద్ రహీమ్ ఖాన్ అనే లాయర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, ఈ కేసు అధికారికంగా మొదలైంది.
అక్టోబర్ 28 ఉదయం 11 గంటలకు సినిమా యూనిట్ కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. అసలు ఈ వివాదం 2024లోనే టీజర్ విడుదల తర్వాత మొదలైంది. అప్పట్లోనే కొంతమంది లాయర్లు సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేసు వేగంగా ముందుకు వెళ్లడంతో సినిమా రిలీజ్‌కు అడ్డంకులు వస్తాయా అనే అనుమానం కలుగుతోంది.
జాలీ ఎల్ఎల్బీ సిరీస్‌కి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. 2013లో అర్షద్ వార్సీ హీరోగా వచ్చిన మొదటి భాగం హిట్ కాగా, 2017లో అక్షయ్‌కుమార్ నటించిన రెండో భాగం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ ఇద్దరూ కలసి నటిస్తున్న మూడో భాగం సెప్టెంబర్ 19న విడుదల కానుంది. అయితే రిలీజ్‌కి ముందు ఈ కోర్టు కేసు కొత్త సవాల్‌గా మారింది.
ఫిర్యాదు దారుడు మాట్లాడుతూ, న్యాయవాదులు, జడ్జీల పట్ల గౌరవం ఉండాలని, సినిమాల్లో వారిని హాస్యాస్పదంగా చూపించడం సమాజంలో తప్పు సందేశం ఇస్తుందని స్పష్టం చేశారు. కోర్టు కూడా ఈ వాదనను సీరియస్ గా పరిగణించింది. దీంతో మేకర్స్‌కు చట్టపరమైన సవాల్ ఎదురైంది. ఇక అక్టోబర్ 28న అక్షయ్‌కుమార్, అర్షద్ వార్సీ, సుభాష్ కపూర్ కోర్టులో హాజరవుతారా లేదా అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates