అధికారికంగా విశ్వంభర వాయిదా గురించి స్వయంగా చిరంజీవే చెప్పేశారు. 2026 వేసవిలో రిలీజ్ చేస్తామని రెండు నిమిషాల ప్రత్యేక వీడియోలో అనౌన్స్ మెంట్ ఇచ్చారు. సాయంత్రం రాబోయే టీజర్ గురించి ఊరించారు. విఎఫ్ఎక్స్ క్వాలిటీలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేస్తున్నామని, గొప్ప అనుభూతి ఇచ్చేందుకు ఈ మాత్రం సమయం అవసరమవుతుందని వివరించారు. దీంతో అక్టోబర్, డిసెంబర్ అంటూ జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టినట్టయ్యింది. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ డ్రామాలో త్రిష హీరోయిన్ కాగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
చిరంజీవి కెరీర్ లో చాలా జాప్యం జరిగి విడుదల తేదీలు ఎక్కువగా మారిన సినిమా 2004లో వచ్చిన అంజి. సుమారు ఆరేళ్ళు నిర్మాణంలో ఉండి థియేటర్లకు రావడానికి అష్టకష్టాలు పడింది. కారణం గ్రాఫిక్స్ విషయంలో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకుడు కోడి రామకృష్ణ రాజీ పడకపోవడమే. రిలీజ్ నాటికి అంచనాలు విపరీతంగా పెరిగిపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. అయినా సరే విఎఫ్ఎక్స్ అద్భుతం అనిపించే సీన్స్ ఇందులో చాలా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే శివలింగం ఎపిసోడ్ ఈ రోజు చూసినా గూస్ బంప్స్ అనిపించే రేంజ్ లో గొప్ప ఫీలింగ్ కలిగిస్తుంది.
ఇప్పుడు విశ్వంభర కూడా ఇదే బాటలో వెళ్తోంది. గత ఏడాది టీజర్ చేసిన డ్యామేజ్, లిరికల్ సాంగ్ కు ఆశించిన స్పందన రాకపోవడం లాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వశిష్ఠ బృందం పోస్ట్ ప్రొడక్షన్ మీద ఎక్కుడ దృష్టి పెడుతోంది. దీని బడ్జెట్ రికవరీ కావాలంటే థియేటర్ రెవెన్యూతో పాటు ఓటిటిలాంటి ఇతర హక్కులకు సంబంధించిన రేట్లు పెద్ద ఎత్తున రావాలి. ప్రస్తుతానికి అవేవి ఇంకా జరగలేదు. చర్చల దశలోనే ఉన్నాయి. ఇవాళ వచ్చే టీజర్ కనక అన్ని వర్గాలను సంతృప్తి పరిస్తే అప్పుడు వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు ఊపందుకుంటాయి. చూడాలి వశిష్ఠ ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడో.
This post was last modified on August 21, 2025 10:34 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…