మనుషులు అవసరం లేకుండా కేవలం ఒక ఆఫీస్ సెటప్, స్టాఫ్, కంప్యూటర్లు ఉంటే చాలు ఇకపై సినిమాలు తీయడం సులభమనిపించే రీతిలో కొందరు ఏఐ టెక్నాలజీని వాడుతుండటం ఆందోళనకు దారి తీస్తోంది. ఇటీవలే బాలీవుడ్ లో పురాణాలు ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని కృత్రిమ మేధస్సుతో ప్యాన్ ఇండియా మూవీస్ తీయబోతున్నట్టు ప్రకటనలు వచ్చాయి. వాటిలో ఒకటి రామాయణం కాగా రెండోది చిరంజీవి హనుమాన్. మహావతార్ లాగా యానిమేషన్, విఎఫ్ఎక్స్ కాకుండా పూర్తిగా ఏఐ మాడ్యూల్ లో వీటిని తీస్తారట. సాఫ్ట్ వేర్లు, టూల్స్ ని అత్యధిక స్థాయికి వాడబోతున్నారు.
ఈ ట్రెండ్ పట్ల అనురాగ్ కశ్యప్ లాంటి ఫిలిం మేకర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనుషుల ద్వారా మాత్రమే ఎమోషన్స్ పండుతాయని, ఇలా ఖర్చు తక్కువనే ఉద్దేశంతో భావోద్వేగాలు లేని బొమ్మలను ఏఐలో సృష్టించి ప్రేక్షకులను అన్యాయం చేయడం మోసమంటూ సోషల్ మీడియాలో నిరసన తెలుపుతున్న వైనం వైరలవుతోంది. చిరంజీవి హనుమాన్ ప్రకటనను తప్పుబడుతూ సదరు దర్శక నిర్మాతల మీద ఫైర్ అయ్యాడు. లీగల్ గా, మోరల్ గా ఎవరూ వీటిని అడ్డుకోలేరు కానీ ఆడియన్స్ ని చీట్ చేసే ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించకూడదనేది అనురాగ్ కశ్యప్ ఉద్దేశం.
నిజమే. క్రమంగా అన్నీ ఏఐతోనే చేసుకుంటే జనాలకు ఉపాధి లేకుండా పోతుంది. సినిమా ఎక్స్ పీరియన్స్ కు అర్థం మారిపోతుంది. భావోద్వేగాలను ఫీలయ్యే అవకాశం లేకుండా తెరపై చూపించే బొమ్మలకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అంటే ఏదో అనుకోవచ్చు అందరూ ఇదే దారిలోకి వెళ్లాలనుకోవడం ప్రమాదకర పరిణామం. ఇదే కొనసాగితే హీరో హీరోయిన్లను కూడా ఏఐలో సృష్టించి ఫ్యాన్స్ ని పిచ్చోళ్లను చేస్తారు. ఇప్పటికే బాడీ డబుల్స్ తో మేనేజ్ చేసింది కాకుండా వీటికి ఏఐ తోడైతే అంతకన్నా పెద్ద స్కామ్ మరొకటి ఉండదు. రాబోయే కాలంలో చాలా విచిత్రమైన పరిణామాలు చూడాల్సి వచ్చేలా ఉంది.
This post was last modified on August 20, 2025 2:53 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…