పెద్ద హీరోల సినిమాలు అంటే మినిమం గ్యారెంటీ అనే పరిస్థితి ఉండేది ఒకప్పుడు. సినిమాకు టాక్ ఎలా ఉన్నా సరే.. తమ స్టార్ పవర్‌తో ఓపెనింగ్స్ రాబట్టడం ద్వారా సినిమాను సేఫ్ జోన్లోకి తీసుకెళ్లిపోయేవారు. టాక్ బాగుంటే మంచి లాభాలూ వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పారితోషకాలు పెరిగిపోయి, మేకింగ్ ఆలస్యమై, బడ్జెట్లు లిమిట్ దాటిపోయి.. అందుకు తగ్గట్లుగా బిజినెస్ జరగక నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. టాక్ అటు ఇటు అయితే సినిమా వీకెండ్ తర్వాత సినిమా నిలబడడం లేదు. ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాక నిర్మాతలకు భారీ నష్టాలు తప్పట్లేదు.
ఐతే ఇలాంటి సందర్భాల్లో స్టార్ హీరోలు కూడా పెద్ద మనసు చేసుకుని నిర్మాతలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన హీరోలు ఆ దిశగా స్పందిస్తుండడం మంచి పరిణామం. గత నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ విడుదల ముంగిట నిర్మాత ఏఎం రత్నం ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే. విపరీతమైన ఆలస్యం వల్ల సినిమాకు ఆశించినంత బజ్ క్రియేట్ కాక, బిజినెస్ పరంగా ఇబ్బందులు తలెత్తి.. ‘వీరమల్లు’ అసలు రిలీజవుతుందా లేదా అన్న సందేహాలు కలిగాయి. ఐతే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారు. ప్రమోషన్లలో పాల్గొని సినిమాను గట్టిగా పుష్ చేశారు. దీంతో సినిమాకు హైప్ క్రియేట్ అయింది.
బిజినెస్ వర్గాల్లో కూడా కదలిక వచ్చింది. మైత్రీ లాంటి పెద్ద సంస్థ నైజాంలో సినిమాను రిలీజ్ చేసిందంటే అది పవన్ చొరవ వల్లే. మొత్తానికి సినిమా థియేటర్లలోకి వచ్చింది. చిన్న మొత్తంలో అడ్వాన్స్ మినహాయిస్తే పవన్ ఈ సినిమా కోసం పారితోషకమే తీసుకోలేదు. రిలీజ్ తర్వాత అడిగే పరిస్థితి అసలే లేదు. రిజల్ట్ ఏంటన్నది పక్కన పెడితే.. పవన్ పెద్ద మనసు వల్లే సినిమా వెలుగు చూసిందన్నది స్పష్టం. ఇక లేటెస్ట్‌గా మరో స్టార్ హీరో తన నిర్మాతను ఆదుకోవడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అతనే.. జూనియర్ ఎన్టీఆర్.
ఈ నందమూరి హీరో బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్-2’ అంచనాలను అందుకోలేకపోయింది. తారక్ మీద అభిమానంతో, సినిమా మీద నమ్మకంతో ఏకంగా రూ.80 కోట్లు పెట్టి తెలుగు హక్కులు సొంతం చేసుకున్నాడు నాగవంశీ. కానీ అందులో సగానికి మించి వెనక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నాగవంశీని ఆదుకోవడానికి ఎన్టీఆర్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్‌తో మాట్లాడి నాగవంశీకి సెటిల్ చేయించడంలో తారక్ చొరవ తీసుకున్నాడట.
అవసరమైతే తన పారితోషకంలో కొంత వెనక్కి ఇవ్వడానికి కూడా తారక్ రెడీ అయినట్లు తెలుస్తోంది. తమకు చెల్లించిన మొత్తంలో నాలుగో వంతుకు దాకా నాగవంశీకి వెనక్కి ఇవ్వడానికి యశ్ రాజ్ సంస్థ సిద్ధమైనట్లు సమాచారం. మరి తారక్ నుంచి ఏమైనా వెనక్కి తీసుకుంటారా లేదా అన్నది స్పష్టత లేదు కానీ.. నాగవంశీకి సాయం అందేలా చూడడంలో తారక్ కీలకంగా వ్యవహరిస్తున్న మాట అయితే నిజమని తెలుస్తోంది. ఇలా నిర్మాతలకు కష్ట కాలంలో అండగా నిలవడం ద్వారా మన స్టార్లు రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు.
This post was last modified on August 20, 2025 2:44 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…