హఠాత్తుగా ఊడిపడ్డట్టు కేవలం కొన్ని గంటల ముందు స్ట్రీమింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చి ఓటిటి రిలీజైన హరిహర వీరమల్లుని డిజిటల్ వెర్షన్ లో చూసిన ఫ్యాన్స్ షాక్ తిన్నారు. కారణమేంటంటే మూడోసారి ఎడిటింగ్ చేసిన ప్రింట్ ని అందుబాటులోకి తేవడం. రిలీజైన రోజు క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ పరస్పరం ఆకాశంలో తలపడుతున్నట్టు ఉన్న షాట్ తో పార్ట్ 2 అని వేసిన సంగతి తెలిసిందే. అయితే దాని మీద ట్రోలింగ్ జరగడంతో ఆ సీన్ కుదించి విలన్ తో ఆంధీ వస్తున్నాడు అనిపించి టైటిల్ కార్డు మార్పు చేశారు. దీని వల్ల డ్యామేజ్ తగ్గలేదు అలాని కలెక్షన్లు పెరగకపోవడం వేరే విషయం.
ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో వేసిన ప్రింట్ లో అసుర హననం పాట చివర్లో సడన్ గా హరిహర వీరమల్లు పార్ట్ 2 యుద్ధభూమి అని వేయడం చూసి అభిమానులు ఇదేందయ్యా అనుకుంటున్నారు. అసలు ఈ మార్పు మళ్ళీ ఎవరు కోరుకున్నారో అర్థం కాక తల గోక్కుంటున్నారు. నిజానికి ఇప్పుడీ సినిమా మరింత అసంపూర్ణంగా అనిపిస్తోంది. దర్శకుడు జ్యోతికృష్ణ ఇలా నిర్ణయించారా లేక ప్రైమ్ సూచనల మేరకు మార్పు చేశారా అనేది అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఓటిటిలో ఇలా ఛేంజ్ చేసిన మూవీగా దీనికి మరో రికార్డు ఇవ్వొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేయడానికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చినట్టే.
పార్ట్ 2 ఉంటుందో లేదో దేవుడికి ఎరుక కానీ ముందైతే ఒరిజినల్ వెర్షన్ అలాగే ఉంచినా సరిపోయేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. విఎఫ్ఎక్స్ విమర్శలు తెచ్చుకున్న సీన్లను తగ్గించడంతో బాబీ డియోల్ డైలాగులు కొన్ని లేపేశారు. ఇలాంటివి ట్రిమ్ చేయడం వరకు ఓకే కానీ కీలకమైన క్లైమాక్స్ మీద ఇన్నిసార్లు కత్తెర వాడటం విచిత్రం. థియేటర్ రిలీజ్ జరిగిన 27 రోజుల తర్వాత ఓటిటిలో వచ్చిన హరిహర వీరమల్లుకు డిజిటల్ రెస్పాన్స్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. అండర్ రేటెడ్ అంటారా లేక ఇక్కడ కూడా చూడలేకపోయామంటారా అనేది వేచి చూడాలి.
This post was last modified on August 20, 2025 1:29 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…