ఒకసారి డేట్ ఇవ్వడం.. తర్వాత సినిమాను వాయిదా వేయడం.. ఈ వ్యవహారం చాలా మామూలైపోయింది సినీ పరిశ్రమలో. ఒకప్పుడు సినిమాను వాయిదా వేయడం అంటే నెగెటివ్ సెంటిమెంటుగా ఫీలయ్యేవాళ్లు కానీ.. కరోనా తర్వాత ఆ ఫీలింగ్ అంతా పక్కకు పోయింది. పెద్ద పెద్ద సినిమాలు కూడా రెండు మూడుసార్లు వాయిదా పడిపోతున్న నేపథ్యంలో… ఏదైనా ఇబ్బంది వస్తే రిలీజ్ పోస్ట్ పోన్ చేయడానికి ఎవ్వరూ సంకోచించడం లేదు.
సెప్టెంబరు మొదటి వారంలో రావాల్సిన మిరాయ్ సినిమాను కూడా ఇలాగే మరోసారి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాకు రెండుసార్లు డేట్ మార్చారు. సెప్టెంబరు 5న ఫిక్స్ అని అనుకుంటుండగా.. ఈ చిత్రాన్ని వెనక్కి జరుపుతున్నట్లు సమాచారం. ఇది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన సినిమా. పెద్ద బడ్జెట్ పెట్టారు. కొన్ని రోజుల కిందటి వరకు సెప్టెంబరు 5కే ఫిక్స్ అనుకున్నారు. హీరో తేజ సజ్జా ప్రమోషనల్ ఇంటర్వ్యూలు కూడా మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడు సీన్ మారినట్లు తెలుస్తోంది.
రిలీజ్ డేట్ అనుకూలంగా లేదా.. లేక ఆ సమయానికి సినిమాను రెడీ చేసే పరిస్థితి లేదా అన్నది తెలియదు కానీ.. సినిమా అయిదే సెప్టెంబరు 5న రాదని సమాచారం. ఇది అదే రోజుకు షెడ్యూల్ అయిన అనుష్క సినిమా ‘ఘాటి’కి కలిసొచ్చే విషయమే. ఆ సినిమా కూడా రెండు మూడుసార్లు వాయిదా పడి సెప్టెంబరు 5కు ఫిక్స్ అయింది. మిరాయ్ సెప్టెంబరు 5 మిస్ అయింది అంటే.. ఇక ఆ నెలలో వచ్చే అవకాశం లేనట్లే. అక్టోబరులోనే రిలీజ్ చేసే అవకాశముంది. త్వరలోనే ‘మిరాయ్’ వాయిదా గురించి అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
This post was last modified on August 19, 2025 4:39 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…