ఎంత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయినా లోకేష్ కనగరాజ్ పాత సినిమాల రెఫరెన్సులు తీసుకోవడంలో చాలా టాలెంట్ చూపిస్తాడు. లియోని ఏ హిస్టరీ అఫ్ వయొలెన్స్ (జగపతిబాబు గాయం 2) ఆధారంగా తీశానని ఓపెన్ గా చెప్పుకున్నాడు కానీ కూలికి సంబంధించి అలాంటి హింట్స్ ఇవ్వలేదు. కానీ దొరికేశాడు. కాకపోతే సినిమా పరిజ్ఞానం ఉన్న వాళ్ళే దాన్ని పసిగట్టారు. కూలిలో సత్యరాజ్ కూతుళ్ళలో ఒకరు రజనీకాంత్ బిడ్డనేది సెకండాఫ్ లో లోకేష్ పెట్టిన ట్విస్టు. ఆమె శృతి హాసనే అన్నది సగటు ప్రేక్షకుడు ముందే గుర్తుపట్టేయడం వల్ల ఆ ఎమోషనల్ బ్లాక్ అంతగా పండలేదు. అయితే ఈ ఎపిసోడ్ కు మూలం వేరే ఉంది.
1992 మలయాళంలో మమ్ముట్టి హీరోగా కౌరవర్ వచ్చింది. అప్పట్లో పెద్ద హిట్టు. తమ మాఫియా సామ్రాజ్యాన్ని కూల్చిన పోలీస్ ఆఫీసర్ విష్ణువర్ధన్ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం జైలు నుంచి బయటికి వచ్చిన మమ్ముట్టికి ఒక విస్తుపోయే నిజం తెలుస్తుంది. తన కూతురు చనిపోలేదని అదే పోలీస్ దగ్గర పెరుగుతోందని తెలిసి షాక్ తింటాడు. అయితే వాళ్ళింట్లో ఉన్న ముగ్గురు అమ్మాయిల్లో తన బిడ్డ ఎవరో తెలియక సతమతమవుతాడు. ఈ పాయింట్ చుట్టూ మంచి డ్రామా నడుస్తుంది. తెలుగులో కంకణంగా డబ్ చేస్తే మంచి హిట్టయ్యింది. మోహన్ బాబు, కృష్ణంరాజు ప్రధాన పాత్రల్లో ఖైదీగారుగా రీమేక్ చేస్తే ఆడలేదు.
సరిగ్గా ఇదే పాయింట్ ని కూలిలో వాడుకున్నాడు లోకేష్ కనగరాజ్. కాకపోతే కంకణంలో మమ్ముట్టికి నిజం తెలియకుండానే పోలీస్ చనిపోతే కూలీలో రివీల్ చేసేస్తాడు. అంతే తేడా. పోర్టులో కూలి సెటప్ అంతా కూడా అమితాబ్ బచ్చన్ దీవార్ (1975) నుంచి తీసుకున్నదే. దాన్ని రజని తీ పేరుతో 1981లో రీమేక్ చేసుకున్నారు. ఇలా రకరకాల ఎలిమెంట్స్ మిక్స్ చేసుకున్న లోకేష్ అన్నింటికీ సరైన మోతాదులో మిక్స్ చేయడంలో పడిన తడబాటు ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. వసూళ్లు కనిపిస్తున్నాయి కానీ ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడంలో మాత్రం లోకేష్ సక్సెస్ కాలేకపోయాడన్నది వాస్తవం.
This post was last modified on August 19, 2025 3:44 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…