మార్కెటింగ్ చేయడంలో రాజమౌళిని కొట్టేవాడు లేడన్నది వాస్తవం. ప్రత్యేకంగా ఎలాంటి ప్లాన్లు వేయకుండానే జాతీయ స్థాయిలో తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడం ఆయన స్టైల్. అక్టోబర్ 31 బాహుబలి ది ఎపిక్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని రెగ్యులర్ రీ రిలీజ్ తరహాలో కాకుండా ఒక కొత్త మూవీ అని ఫీల్ వచ్చేలా ప్రత్యేకమైన పబ్లిసిటీని ప్లాన్ చేస్తున్నారట. రెండు భాగాలు కలిపి సింగల్ పార్ట్ గా చేయడమే కాక గతంలో లేని ఎక్స్ క్లూజివ్ సీన్స్ ఇందులో ఉంటాయనే లీక్ అభిమానుల్లో ఎగ్జైట్ మెంట్ పెంచుతోంది. ఎప్పుడెప్పుడు చూద్దామాని ఎదురు చూడటం మొదలుపెట్టారు.
ప్రమోషన్ల పరంగా టైటిల్ కు తగ్గట్టుగానే ఎపిక్ స్థాయిలో చేయబోతున్నారట. తాజాగా ప్రభాస్, రానాలతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ షూట్ చేసినట్టు సమాచారం. అనుష్క కూడా పాల్గొందనే లీక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. సెప్టెంబర్ 5 రాబోతున్న ఘాటీ కోసం అనుష్క ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉందట. కానీ టీమ్ ఆ విషయాన్ని నిర్ధారించడం లేదు. సెప్టెంబర్ లో రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్, కిచ్చ సుదీప్, నాజర్ తదితరులతో స్పెషల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు ఉండబోతున్నాయని తెలిసింది. ఇవన్నీ కార్తికేయ పర్యవేక్షణలో ఏది ఎప్పుడు జరగాలనే బ్లూ ప్రింట్ తో సిద్ధం చేసి ఉంచారట.
చూస్తుంటే బాహుబలి ఎపిక్ కి భీకరమైన ఓపెనింగ్స్ రావడం ఖాయమనేలా ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు షూట్ లో బిజీగా ఉన్నజక్కన్న అక్టోబర్ రెండో వారం నుంచి పూర్తిగా ఎపిక్ కోసం సమయం కేటాయించబోతున్నట్టు తెలిసింది. ముందు రోజు ప్రీమియర్లతో పాటు వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు శోభు యార్లగడ్డ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ బాహుబలి వన్ పార్ట్ ఫార్ములా కనక సక్సెస్ అయితే భవిష్యత్తులో పుష్ప, కెజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్లు ఇదే రూటు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. అన్నట్టు బాహుబలి ఎపిక్ నిడివి మూడున్నర గంటలు ఉండొచ్చు. అంతకన్నా తగ్గించడం సాధ్యపడటం లేదని వినికిడి.
This post was last modified on August 19, 2025 6:36 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…