ఒకప్పుడు ఇద్దరు హీరోయిన్ల ముద్దుల ప్రియుడిగా శోభన్ బాబు తర్వాత అంత ఇమేజ్ సంపాదించుకున్న జగపతి బాబు సీనియర్ గా మారే కొద్దీ హీరో వేషాలు తగ్గించేయడం చూశాం. లెజెండ్ తో విలన్ గా మారి బాలకృష్ణకు ధీటుగా ఫ్యాక్షనిజంని పండించిన తీరు ఆయనకో గొప్ప ఇన్నింగ్స్ ని నిర్మించి ఇచ్చింది. ఎంతగా అంటే జగ్గు భాయ్ డేట్లు కావాలంటే దర్శక నిర్మాతలు చాలా ముందుగానే ప్లాన్ చేసుకునేలా. నాన్నకు ప్రేమతో, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్లు వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం ఇవ్వలేదు. అయితే ఈ మధ్య జగపతిబాబు దూకుడు కొంత తగ్గింది. ఇతర బాషల విలన్లు పెరిగాక స్లో అయ్యారు.
దీంతో తెలివిగా టాక్ షో యాంకర్ అవతారం ఎత్తేశారు. జీ ఛానల్ కోసం జయమ్ము నిశ్చయమ్మురా అనే కొత్త షోకి వ్యాఖ్యాతగా సెలెబ్రిటీలను తీసుకొచ్చి వాళ్ళ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ముచ్చట్లు చెప్పుకునే కార్యక్రమానికి తెరతీశారు. నిజానికి ఇది కొత్త కాన్సెప్ట్ కాదు. బాలకృష్ణ అన్ స్టాపబుల్ ని పోలి ఉంటుంది. గతంలో దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, సమంత లాంటి ఎందరో ఇవి ట్రై చేసినవాళ్లే. అయినా సరే జగపతిబాబు హోస్ట్ చేస్తుంటే ఫ్రెష్ నెస్ కనిపిస్తోంది. అయితే జయమ్ము నిశ్చయమ్మురాకి మూలం ఇవి కాదు. ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ఇదే జీ ఛానల్ లో వచ్చిన వీకెండ్ విత్ రమేష్ దీనికి ఆధారం,.
ఎందరో శాండల్ వుడ్ స్టార్లతో హీరో రమేష్ అరవింద్ దాన్ని నడిపించిన తీరు అద్భుత స్పందన తీసుకొచ్చింది. కన్నడలో ఉన్న పేరున్న నటీనటులు సాంకేతిక నిపుణులు అందరితోనూ రమేష్ ఈ షో చేశారు. ఇప్పుడదే ఫార్మాట్ లో జయమ్ము నిశ్చయమ్మురాని తీస్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఎపిసోడ్ లో వచ్చిన ప్రముఖులకు సర్ప్రైజ్ ఇచ్చేలా వాళ్ళ కుటుంబ సభ్యులు లేదా ఎక్కడో దూరంగా ఉన్న స్నేహితులు బంధువులను తీసుకొచ్చి ఆశ్చర్యపరుస్తారు. ఇప్పటికే నాగార్జున ఎపిసోడ్ హిట్టయ్యింది. శ్రీలీలది ప్రోమోతోనే ఆకట్టుకుంటోంది. ఊహించని బడా స్టార్లు చాలానే రాబోతున్నారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates