ఇటీవలే విడుదలైన కూలీకి మిశ్రమ స్పందన రావడం రజనీకాంత్ ఫ్యాన్స్ తో పాటు లోకేష్ కనగరాజ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ లియోలాగా మెల్లగా ఊపందుకుని రికార్డులు బద్దలు కొడుతుందని ఎదురు చూస్తే అది నెరవేరేలా లేదు. ఇప్పటికైతే నాలుగు వందల కోట్లు రాబట్టింది కానీ ఇకపై రన్ ఎలా ఉంటుందనే టెన్షన్ బయ్యర్ వర్గాల్లో లేకపోలేదు. ముఖ్యంగా అందరి వేళ్ళు దర్శకుడు లోకేష్ కనగరాజ్ మీదకే వెళ్తున్నాయి. త్వరలో ఖైదీ 2 తీయడానికి రెడీ అవుతున్న తరుణంలో చెన్నై వర్గాల్లో తిరుగుతున్న ఒక టాక్ అనుమానాలు రేకెత్తించేలా ఉంది.
దాని ప్రకారం లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ – లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో ఒక భారీ ప్రాజెక్టు చేయబోతున్నాడట. ఇది కొన్ని నెలల క్రితం అతనే చూచాయగా చెప్పాడు కానీ కథ లేదన్నాడు. మరి ఇప్పుడు ఖైదీ 2 స్థానంలో ఇంత హఠాత్తుగా ఇది ఎందుకు వచ్చిందో అంతు చిక్కడం లేదు. కూలీ ఫెయిల్యూర్ ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ప్రచారం లేవనెత్తారానే సందేహం లేకపోలేదు. ఎందుకంటే ఇదే లోకేష్ కూలి ప్రమోషన్లలో కార్తీ నాకు లైఫ్ ఇచ్చాడు, అతను ఏ టయర్ లో ఉన్నాడనేది నాకు అనవసరం, ఖైదీ 2 మొదలు పెడతానని చాలా స్పష్టంగా వివరించి చెప్పాడు.
మరి ఇప్పుడీ కొత్త న్యూస్ ఎలా వచ్చిందో లోకేష్ చెప్పాలి. రజని, కమల్ కలిసి నటించి దశాబ్దాలు గడిచిపోయాయి. ఒకవేళ నిజంగా ఈ కలయిక సాధ్యమైతే మాత్రం వన్ అఫ్ ది బెస్ట్ కాంబోగా నిలుస్తుంది. కాకపోతే సెట్స్ పైకి వెళ్ళేదాకా అనుమానమే. ఎందుకంటే లోకేష్ ఖైదీ 2 స్క్రిప్ట్ ని పూర్తి చేయాలి. అది షూట్ చేశాక అమీర్ ఖాన్ తో సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో బాలీవుడ్ మూవీ ఉంది. లైన్ లో రోలెక్స్ ని పెట్టుకున్నాడు. ఇవన్నీ కాదని రజని కమల్ తో ముందుకు వెళ్తాడా అంటే ఏమో తానుగా చెప్పేదాకా నమ్మలేని పరిస్థితి. కూలీని ఫ్లాపని ఇప్పటికిప్పుడు అనలేం కానీ లోకేష్ ఫిల్మోగ్రఫీలో వీక్ టాక్ వచ్చింది మాత్రం ఈ సినిమాకే.
This post was last modified on August 19, 2025 11:07 am
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్కు…