Movie News

ఛత్రపతి రీమేక్.. సుజీత్ తేల్చేశాడు

‘రన్ రాజా రన్’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చాడు సుజీత్. ఆ చిన్న సినిమాలో అతడి టాలెంట్ చూసి ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ అతడికి కమిట్మెంట్ ఇచ్చాడు. ‘బాహుబలి’ లాంటి మెగా బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రభాస్ సుజీత్‌తోనే సినిమా చేశాడు. కానీ అంచనాలను అందుకోవడంలో సుజీత్ విఫలమయ్యాడు.

‘సాహో’ అతడి కెరీర్‌ను తల్లకిందులు చేసింది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్‌తో ‘లూసిఫర్’ రీమేక్‌లో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఈ మధ్య ఏమో ‘ఛత్రపతి’ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలో సుజీత్ రీమేక్ చేయబోతున్నాడని.. దానికి మిగతా కాస్టింగ్ కూడా ఖరారైపోయిందని.. ప్రి ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగిపోతోందని మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ చివరికి చూస్తే అది ఫేక్ న్యూస్ అని తేలిపోయింది.

తాను ‘ఛత్రపతి’ బాలీవుడ్ రీమేక్‌ను డైరెక్ట్ చేయడం లేదని సుజీతే స్వయంగా స్పష్టత ఇచ్చాడు. ‘ఛత్రపతి’ ఊసు ఎత్తకుండా అతను ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పెట్టి ‘‘ఏ రీమేకూ చేయట్లేదు’’ అనే క్యాప్షన్ జోడించాడు సుజీత్. దీన్ని బట్టి ‘ఛత్రపతి’ అనే కాదు.. మరే రీమేక్‌ కోసమూ తాను పని చేయట్లేదని.. రీమేక్‌లు చేసే ఉద్దేశమే తనకు లేదని చెప్పకనే చెప్పినట్లయింది. ‘లూసిఫర్’ రీమేక్ నుంచి కూడా సుజీతే తప్పుకున్నట్లు చిరంజీవి వెల్లడించిన సంగతి తెలిసిందే.

అదే నిజమైతే.. ‘ఛత్రపతి’ రీమేక్ చేయడంలోనూ సుజీత్‌కు ఆసక్తి లేనట్లే. ప్రస్తుతం తన సొంత కథ మీదే సుజీత్ పని చేస్తున్నట్లుంది. ‘రన్ రాజా రన్’ తరహాలో మీడియం బడ్జెట్లో ఓ సినిమా చేసి తనేంటో రుజువు చేసుకుని ఆ తర్వాత స్టార్ల కోసం ప్రయత్నిద్దామని సుజీత్ భావిస్తుండొచ్చు. అతడి తొలి రెండు సినిమాలను నిర్మించిన యువి క్రియేషన్స్‌లోనే సుజీత్ తన తర్వాతి సినిమాను కూడా చేయొచ్చని అంటున్నారు.

This post was last modified on November 21, 2020 2:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బైడెన్ వ‌ర్సెస్ ట్రంప్‌.. న‌లిగిపోతున్న విదేశీయులు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల‌ను ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. మ‌రో రెండు మూడు వారాల్లోనే…

9 hours ago

ఆ ఖైదీ జైలు శిక్ష‌ ఫిఫ్టీ-ఫిఫ్టీ.. భార‌త్‌, బ్రిట‌న్ ఒప్పందం!

జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చ‌ర్యం అంద‌రికీ క‌లుగుతుంది. కానీ, ఇది వాస్త‌వం. దీనికి సంబంధించి…

10 hours ago

‘టీడీపీ త‌లుపులు తెరిస్తే.. వైసీపీ ఖాళీ’

ఏపీలో రాజ‌కీయ వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే…

11 hours ago

18 ఏళ్ల త‌ర్వాత‌ ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో బెయిల్

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ప‌రిటాల ర‌వి గురించి యావ‌త్ ఉమ్మ‌డి రాష్ట్రానికి తెలిసిందే. అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో…

12 hours ago

మహేష్ ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు.. జర భద్రం!

క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…

13 hours ago