టాలీవుడ్లో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న అరంగేట్రం.. నందమూరి మోక్షజ్ఞదే. నిన్నటితరం సూపర్ స్టార్లలో చిరంజీవి, నాగార్జునల వారసులు ఎప్పుడో సినిమాల్లోకి వచ్చారు కానీ.. నందమూరి బాలకృష్ణ కొడుకు అరంగేట్రం మాత్రం చాలా ఆలస్యం అవుతోంది. 2017లోనే మోక్షజ్ఞ సినిమాల్లోకి వచ్చేస్తాడని ప్రచారం సాగింది కానీ.. ఇప్పటికీ అది జరగలేదు. గత ఏడాది మోక్షజ్ఞ తొలి చిత్రం గురించి అధికారికంగా ప్రకటించి, అతడి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయడంతో నందమూరి అభిమానులు ఎగ్జైట్ అయ్యారు.
కానీ ముహూర్త కార్యమ్రానికి అంతా సిద్ధం చేసుకున్నాక అనివార్య కారణాలతో ఆ వేడుక వాయిదా పడింది. ఇక అప్పట్నుంచి మోక్షజ్ఞ తొలి చిత్రంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఐతే గత ఏడాది కాలంలో మోక్షజ్ఞ బయట ఎప్పుడు కనిపించినా.. సోషల్ మీడియాలో తన పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేస్తోంది.
ప్రశాంత్ వర్మతో తన సినిమా ముహూర్త వేడుక రద్దయ్యాక పెద్దగా మీడియా దృష్టిలో పడని మోక్షజ్ఞ కొంచెం గ్యాప్ తర్వాత కెమెరాలకు చిక్కాడు. హైదరాబాద్‌లో నందమూరి, నారా కుటుంబాలు హాజరైన ఒక పెళ్లి వేడుకలో బాలయ్య తనయుడు అందరి దృష్టినీ ఆకర్షించాడు. షేర్వాణీలో తన లుక్ బాగుంది. గతంలో కంటే మరింత సన్నబడి, ట్రెండీ గడ్డంతో షార్ప్ లుక్‌లో దర్శనమిచ్చాడు మోక్షజ్ఞ. ఈ లుక్‌ను బట్టి చూస్తే అతను సినిమాలకు ఏమీ దూరం కావట్లేదని.. తన అరంగేట్రం కోసం ప్రిపరేషన్లోనే ఉన్నాడని అర్థమవుతోంది.
కాకపోతే తన మీద తనకు పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తుండొచ్చని అభిమానలు భావిస్తున్నారు. తన తొలి చిత్రం ముందు అనుకున్నట్లు ప్రశాంత్ వర్మతోనే ఉంటుందా.. లేక ఇంకో దర్శకుడిని ఏమైనా లైన్లో పెట్టారా అన్నది వారి కుటుంబ వర్గాలకే తెలియాలి. ఈ ఏడాది మోక్షు డెబ్యూ మూవీ మొదలు కాకపోవచ్చనే అనిపిస్తోంది. కొత్త ఏడాదిలో అయినా నిరీక్షణకు తెరదించితే బాగుండని అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on August 18, 2025 6:54 pm
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…