Movie News

ఎక్కడ గాడి తప్పానో చెప్పిన మురుగదాస్

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు మురుగదాస్. రమణ (ఠాగూర్ ఒరిజినల్), గజిని, తుపాకి, కత్తి చిత్రాలతో అతను భారీ విజయాలందుకున్నాడు. ‘గజిని’ని హిందీలో అతనే రీమేక్ చేస్తే అది అప్పటి బాలీవుడ్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఎంతో ఆసక్తితో మురుగదాస్ దర్శకత్వంలో సినిమాలు చేశారు. ఐతే మురుగదాస్ చిరుతో చేసిన ‘స్టాలిన్’ మోస్తరుగా ఆడగా.. మహేష్‌తో తీసిన ‘స్పైడర్’ డిజాస్టర్ అయింది. 

‘స్పైడర్’ తర్వాత మురుగదాస్‌కు ఏ సినిమా కలిసి రాలేదు. సర్కార్, దర్బార్, సికందర్.. ఇలా ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అయ్యాయి. ‘సికందర్’ చూశాక మురుగదాస్ పూర్తిగా టచ్ కోల్పోయాడనిపించింది. ఇప్పుడు శివకార్తికేయన్ సినిమా ‘మదరాసి’తో పుంజుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మురుగదాస్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫెయిల్యూర్లకు కారణమేంటో వివరించాడు.

సూర్యతో చేసిన ‘సెవన్త్ సెన్స్’ తర్వాత తాను ‘తుపాకి’ కథ రాశానని.. కానీ ఆ స్క్రిప్టు పూర్తి కాకముందే సినిమా మొదలుపెట్టేశానని మురుగదాస్ తెలిపాడు. విజయ్‌కి తాను చెప్పిన కొన్ని ఎపిసోడ్లు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని.. దీంతో స్క్రిప్టు పూర్తి కాకముందే సినిమాను మొదలుపెట్టేశామని.. అది బ్లాక్ బస్టర్ అయిందని మురుగదాస్ చెప్పాడు. విజయ్‌తో ఆ తర్వాత తీసిన ‘కత్తి’ విషయంలో కూడా ఇదే జరిగిందని.. దీంతో సినిమా అనే ఆర్ట్‌లో తాను మాస్టర్ అయిపోయాననే ఫీలింగ్ తనకు వచ్చేసిందని మురుగదాస్ తెలిపాడు. 

కానీ ఇలా పూర్తి స్క్రిప్టులు సిద్ధం కాకుండానే సినిమాలు చేయడం తప్పని.. అది తన తర్వాతి చిత్రాలపై ప్రభావం చూపిందని.. అదే తన ఫెయిల్యూర్లకు కారణమైందని తెలిపాడు మురుగదాస్. సల్మాన్ ఖాన్‌తో చేసిన ‘సికందర్’ విషయంలో తన కంట్రోల్ పూర్తిగా లేదని మురుగదాస్ తెలిపాడు. ‘మదరాసి’ మాత్రం తనకు మంచి బ్రేక్ ఇస్తుందని అతనన్నాడు. ‘తుపాకి’ సినిమాకు సీక్వెల్ చేయడానికి స్కోప్ ఉందని.. క్లైమాక్స్‌లో హీరో తిరిగి బోర్డర్‌కు వెళ్లడం చూపిస్తామని.. తర్వాత తన జీవితంలో ఏం జరుగుతుందన్నది పార్ట్-2గా తీయొచ్చని.. కుదిరితే ఆ సినిమా చేస్తానని మురుగదాస్ తెలిపాడు.

This post was last modified on August 17, 2025 6:10 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Murugadoss

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

1 hour ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

4 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

4 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

5 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

6 hours ago