కూలీ విడుదల ముందు వరకు అమీర్ ఖాన్ క్యామియో మీద ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. దాహా పాత్రలో తన విశ్వరూపం చూడొచ్చని ఫ్యాన్స్ గట్టి నమ్మకం పెట్టుకున్నారు. విక్రమ్ లో రోలెక్స్ ని మించిన ఇంటెన్సిటీ ఇందులో ఉంటుందనే తరహాలో టీమ్ పెద్ద బిల్డప్పే ఇచ్చింది. తీరా చూస్తే దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆ క్యారెక్టర్ కామెడీకి ఎక్కువ, విలనీకి తక్కువ టైపులో నీరుగార్చేశాడు. ప్రపంచానికి వణికించే మాఫియా డాన్ హీరో దగ్గరకి వచ్చి సిల్లీ జోకులు వేయడం, బీడీని తీసుకుని బిల్డప్ ఇవ్వడం, దేవా ఇన్నేళ్లు దొరకలేదంటూ లాజిక్ కి దూరంగా జోక్ చేయడం అన్నీ రివర్స్ అయ్యాయి.
ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఒకటుంది. ఎలాగూ రోలెక్స్ తో పోలిక తెస్తారు కానీ రివర్స్ లో దాహాని కామెడీగా చూపిద్దాం అనుకున్న లోకేష్ ఐడియా మిస్ ఫైర్ అయ్యింది. వేల కోట్ల దందా చేసే ఒక డాన్ ఇంత సిల్లీగా ప్రవర్తించడు. పైగా సైమన్ ని చంపిన దేవా కళ్లెదుట ఉంటే ఎందుకు హత్య చేయడో అర్థం కాదు. విక్రమ్ లాగా రౌడీల గుంపులో కమల్ హాసన్ కలిసిపోయినట్టు చూపించినా న్యాయం ఉండేది. కానీ ఇక్కడ అంతా ఓపెన్ గా చూపెట్టారు. దీంతో ఈ ఎపిసోడ్ ఆకట్టుకోలేదు. రజని, అమీర్, ఉపేంద్ర ముగ్గురు కలిసి పొగతాగే సీన్ కూడా సోసో అనిపించింది. మొత్తంగా తేడా కొట్టేసింది.
దీన్ని బట్టి రోలెక్స్ ని మించిపోయేలా మరో పాత్రను సృష్టించడం లోకేష్ కనగరాజ్ వల్లే కాదని అర్థమైపోయింది. కేవలం ఈ క్యారెక్టర్ తోనే ఒక ఫుల్ మూవీ తీస్తానని చెప్పిన లోకేష్ వీలైనంత త్వరగా ఆ మాటను నిలబెట్టుకోమని సూర్య ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఎలాగూ సూర్య ఫ్లాపుల్లో ఉన్నాడు, కూలికి కూడా mixed రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇద్దరూ కలిసి హిట్టు కొట్టాలని కోరుకుంటున్నారు. కాకపోతే ఇది ఇప్పట్లో జరగదు. ఖైదీ 2 తర్వాత అమీర్ ఖాన్ తో బాలీవుడ్ మూవీ ఉంది. ఈ రెండూ అయ్యేలోగా 2027 అయిపోతుంది. ఆపై రోలెక్స్ తీస్తాననే మాట మీద లోకేష్ ఉంటాడో లేదో గ్యారెంటీ లేదు. సో ఆశలు పెట్టుకోకపోవడం బెటర్.
This post was last modified on August 16, 2025 4:49 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…