ఆగస్ట్ 27 విడుదల కావాల్సిన మాస్ జాతర వాయిదా తప్పదనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో ఊపందుకుంది. చేతిలో కేవలం పన్నెండు రోజులు మాత్రమే ఉన్న నేపధ్యంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయట. వాటి వల్లే పోస్ట్ పోన్ వైపు మొగ్గు చూపుతున్నారని ఇన్ సైడ్ టాక్. అధికారికంగా చెప్పలేదు కానీ కన్ఫర్మ్ అయితే ప్రకటన రావొచ్చు. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కు ఆశించిన స్పందన రాలేదు. ఎంత మాస్ మహారాజా స్టైల్ లో ఉన్నా కంటెంట్ మరీ రొటీన్ గా ఉందనే కంప్లైంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఈ ఫీడ్ బ్యాక్ మళ్ళీ రిపీట్ కాకుండా ట్రైలర్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇదంతా బాగానే ఉంది కానీ ఒకవేళ నిజంగా మాస్ మహారాజా తప్పుకుంటే కొన్ని చిక్కులు అయితే తప్పవు. ఎందుకంటే సెప్టెంబర్ ఇప్పటికే ప్యాక్ అయిపోయింది. ఘాటీ, మిరాయ్, మదరాసి మొదటి వారంలో వస్తుండగా సెకండ్ వీక్ లో కిష్కిందపురితో పాటు భద్రకాళి అఫీషియల్ గా లాక్ చేసుకుంది. అటుపై 25వ తేదీ అఖండ 2, ఓజి పెద్ద ఎత్తున క్లాష్ కాబోతున్నాయి. వీటిలో ఒకటి తప్పుకోవచ్చనే టాక్ వినిపిస్తోంది కానీ నిర్ధారణగా తెలియడం లేదు. తర్వాత అక్టోబర్ 2 కాంతార, ఇడ్లి కడాయి లాంటి క్రేజీ రిలీజులు క్యూ కట్టి ఉన్నాయి. మరి మాస్ జాతర మధ్యలో ఎక్కడ సెట్ చేసుకుంటుందనేది ఆసక్తికరమైన ప్రశ్న.
సితార సంస్థకు పదిహేను రోజుల గ్యాప్ లో రెండు షాకులు తగిలాయి. పాజిటివ్ గా అనిపించిన కింగ్డమ్ చివరికి ఫెయిల్యూర్ గా నిలిచింది. పెద్ద మొత్తంలో హక్కులు పోసి కొన్న వార్ 2 హిందీ కంటే తెలుగులోనే తక్కువ వసూళ్లు తేవడం ఆందోళన రేపుతోంది. ఈ వ్యవహారాల మధ్యలో మాస్ జాతర ప్రమోషన్లు, రిలీజ్ వ్యాపారాలు చూసుకోవడం కష్టం. అందులోనూ ఇంకా ఫైనల్ కాపీ సిద్ధం కాకుండా లేనిపోని ఒత్తిడి తెచ్చుకోవడం కష్టమవుతుంది. సరే వాయిదాలు అందరికీ సహజమే కానీ దగ్గరలో కొత్త డేట్ పడుతుందా లేక అక్టోబర్ నవంబర్ నెలలకు షిఫ్ట్ అవుతుందానేది అభిమానులను తొలుస్తున్న ప్రశ్న.
Gulte Telugu Telugu Political and Movie News Updates