మోనల్ గజ్జర్‍కి బిగ్‍బాస్ క్రియేటివ్ టీమ్ ఆశీస్సులున్నాయని మొదట్నుంచీ ఆరోపణలు వస్తున్నాయి. ఆమె వల్ల షోకి అవసరమయిన మసాలా కంటెంట్ లభిస్తూ వుండడంతో తనను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారని ఎన్ని ఆరోపణలు వచ్చినా కానీ మోనల్ ప్రతిసారీ సేవ్ అవుతూనే వస్తోంది. అయితే ఈసారి మాత్రం మోనల్ ఎలిమినేట్ కాక తప్పదనిపిస్తోంది. ఎందుకంటే నామినేట్ అయిన వారిలో మోనల్, అరియానా, లాస్యకు తక్కువ ఓట్లు పోలవుతున్నాయి. అయితే లాస్య, మోనల్‍కి ఫ్యామిలీ రీయూనియన్ ఎపిసోడ్ ఫెట్చింగ్ అయింది. మోనల్ ఎపిసోడ్‍ని మరింత నాటకీయంగా మలచి ఆమెకు జాలితో ఓట్లు పడేట్టు చూసుకున్నారు.
ఒకవేళ నిజంగా అది ఎఫెక్టివ్‍గా పని చేసినట్టయితే ఈ వారం ఆమె కాకుండా ఎవరు ఎలిమినేట్ అవుతారు? అరియానా, హారిక ఇద్దరిలో ఒకరు అవుట్ అవ్వవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీజన్లో సర్‍ప్రైజ్ ఎలిమినేషన్లు చాలానే జరిగాయి కాబట్టి ఈసారి కూడా మోనల్‍ని సేవ్ చేసి సోషల్ మీడియా స్టార్స్ అయిన అరియానా, హారికల్లో ఒకరిని ఇంటికి పంపిస్తారనే టాక్ హల్ చల్ చేస్తోంది. అరియానా ఓవరాక్షన్ కూడా తన ఓటింగ్‍ని ప్రభావితం చేస్తోందనేది స్పష్టంగా కనిపిస్తోంది. మరి ‘బోల్డ్ పాప’ ఈసారి బయటకు పోకుండా సేవ్ అవుతుందా?
This post was last modified on November 20, 2020 10:47 pm
అదిగో పులి.. అంటే ఇదిగో తోక.. అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం పరుగులు పెడుతోంది. ప్రస్తుతం భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో…
జైలర్ 2లో బాలకృష్ణ ప్రత్యేక క్యామియో చేయడం దాదాపు ఖరారయినట్టే. టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ బాలయ్య వైపు…
ఎంతమంది నేతలు మారినా పాకిస్తాన్‌లో ఆర్థిక కష్టాలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. దేశం ఎదుగుదలపై దృష్టి పెట్టడం కంటే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా… సంచలనంగానే నిలుస్తోంది. తాజాగా పాకిస్తాన్ తో…
పెద్ద పెద్ద స్టార్లకే కాదు.. అప్ కమింగ్ హీరోలకు కూడా పేరు వెనుక ఏదో ఒక బిరుదు ఉండాల్సిందే. కొందరు…
అదేంటో గానీ…జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టే ప్రతి కార్యక్రమమూ ప్రత్యేకంగానే నిలుస్తోంది. ఏదో సినిమా…