సక్సెస్ రేట్ అంత గొప్పగా లేకపోయినా.. ప్రస్తుతం ఇండియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. తెలుగులో సీతారామం, హాయ్ నాన్న లాంటి చిత్రాలతో ఆమె మంచి గుర్తింపే సంపాదించింది. ఇటు తెలుగులో, అటు హిందీలో ఆమెకు అవకాశాలకు లోటు లేదు. అందాలకు లోటు లేని మృణాల్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. తన మాట తీరు కూడా ఆకట్టుకునేలానే ఉంటుంది.
కానీ ఇలాంటి టైంలో ఆమె ఒక అనుకోని వివాదంతో వార్తల్లోకి వచ్చింది. మృణాల్ సినిమా హీరోయిన్ కావడానికి ముందు సీరియళ్లలో నటించిన సంగతి తెలిసిందే. ఆ టైంలో ఒక కోస్టార్‌తో కలిసి కనిపించిన వీడియోలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ బిపాసా బసు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అందులో తన పక్కనున్న నటుడిని ఉద్దేశించి.. నువ్వు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతూ.. కండలు ఉన్న అమ్మాయిని చేసుకుంటావా అంది మృణాల్. అతను ఔనన్నట్లుగా మాట్లాడితే.. ‘‘సరే వెళ్లి బిపాసాను పెళ్లి చేసుకో’’ అని మృణాల్ వ్యాఖ్యానించింది. అంతే కాక బిపాసా కంటే తాను చాలా అందంగా ఉంటానని కూడా మృణాల్ కామెంట్ చేసింది. అప్పట్లో మృణాల్‌కు గుర్తింపు లేకపోవడం వల్ల ఆ వీడియో వెలుగులోకి రాలేదేమో.
కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఆ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతోంది. బిపాసా ఫ్యాన్స్ మృణాల్ మీద మండిపడుతున్నారు. ఇదే టైంలో బిపాసా పెట్టిన ఇన్‌స్టా పోస్టు చూస్తే.. మృణాల్‌కు కౌంటర్ వేసినట్లే కనిపిస్తోంది. బలమైన మహిళలు ఒకరికొకరు సాయం చేసుకుంటారని.. అందమైన అమ్మాయిలు కూడా కండలు పెంచాలని.. అప్పుడే బలంగా ఉంటారని.. కండలు పెంచితే శారీరకంగానే కాక మానసికంగా కూడా బలంగా ఉంటారని ఆమె ఆ పోస్టులో పేర్కొంది. అది చూస్తే మృణాల్ ఒకప్పటి వ్యాఖ్యలకు ఇప్పుడు బిపాసా కౌంటర్ ఇచ్చిందనడంలో సందేహలేమీ లేనట్లే.
This post was last modified on August 14, 2025 12:47 pm
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…