రాజమౌళి మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అలియా భట్ త్వరలో ఒక యంగ్ అడల్ట్ మూవీ చేయనుంది. 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు మాత్రమే చూసే కంటెంట్ లో మొదటిసారి దర్శనమివ్వనుంది. అయితే ఇది థియేటర్ కోసం కాదు. అమెజాన్ ప్రైమ్ నిర్మించబోయే ఓటిటి ప్లాట్ ఫార్మ్ కోసం ఈ రిస్కు తీసుకోవడానికి రెడీ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే ఈ ప్రాజెక్టుకి అలియా భట్ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించనుంది. తన ఎటర్నల్ సన్ షైన్ పిక్చర్స్ పతాకంపై చాక్ బోర్డ్ ఎంటర్ టైన్మెంట్ ని ప్రొడక్షన్ పార్ట్ నర్ గా తీసుకుని శ్రీతి ముఖర్జీని దర్శకురాలిగా పరిశ్రమకు పరిచయం చేయబోతోంది.
ఈ శ్రీతి ఎవరంటే బ్రహ్మాస్త, వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీకి స్వయానా బంధువు. ఇప్పుడు తీయబోయే సినిమా వెనుక ఒక ఇంటరెస్టింగ్ స్టోరీ ఉంది. అలియా భర్త రన్బీర్ కపూర్ క్లాసిక్ మూవీస్ లో ఒకటైన వేక్ అప్ సిద్ అలియాకు చాలా ఇష్టం. దాన్ని అమ్మాయిల కోణంలో అది కూడా కొంచెం బోల్డ్ గా చెప్తే ఎలా ఉంటుందనే ఆలోచనని బ్రహ్మస్త్రకు అసిస్టెంట్ గా పని చేస్తున్న శ్రీతి ముఖర్జీతో చెప్పింది. దాంతో ఆమె ఎగ్జైట్ అయిపోయి ఈ స్టోరీని డెవలప్ చేసింది. కాలేజీ వాతావరణంలో అధిక శాతం కొత్త నటీనటులతో చాలా ఫ్రెష్ గా దీన్ని తీయబోతున్నారట. అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.
2022లో వచ్చిన నెట్ ఫ్లిక్స్ మూవీ డార్లింగ్స్ తో అలియా భట్ నిర్మాతగా మారింది. తల్లి సోని రజ్డాన్ దర్శకత్వంలో డిఫికల్ట్ డాటర్స్ అనే మరో చిత్రం నిర్మాణంలో ఉంది. పైన చెప్పిన సినిమా మూడోది. ఆర్టిస్టుగా బిజీగా ఉన్న అలియా వచ్చే ఏడాది మార్చిలో భర్త రన్బీర్ తో మరోసారి స్క్రీన్ పంచుకున్న లవ్ అండ్ వార్ లో ప్రేక్షకులను పలకరించనుంది. స్త్రీ 2 నిర్మాతల చాముండాలో టైటిల్ రోల్ పోషిస్తోంది. ప్రభాస్ కల్కి సీక్వెల్ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ తనను సంప్రదించినట్టుగా టాక్ ఉంది కానీ ఇంకా నిర్ధారణ కాలేదు. అన్నట్టు అలియా చేయబోయే బోల్డ్ మూవీ తెలుగుతో సహా అన్ని భాషల్లో వచ్చే ఏడాది స్ట్రీమింగ్ కానుంది.
This post was last modified on August 13, 2025 2:32 pm
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…