Movie News

టఫ్ టుమారో : బాక్సాఫీస్ వీధుల్లో స్టార్ల యుద్ధం

రేపు అతి పెద్ద క్లాష్ కోసం థియేటర్లు సిద్ధమయ్యాయి. గత రెండు నెలలుగా సరైన బ్లాక్ బస్టర్ లేక అలో లక్ష్మణా అంటూ దిక్కులు చూస్తున్న ఎగ్జిబిటర్లకు ఊపిరి అందించేందుకు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, రజనీకాంత్, నాగార్జున రెడీ అయ్యారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో ప్రస్తుతానికి కూలి పై చేయి స్పష్టంగా కనిపిస్తోంది. బుక్ మై షోలో రెండింటి మధ్య డబుల్ మార్జిన్ వ్యత్యాసం దాస్తే దాగేది కాదు. అయితే లోకేష్ కనగరాజ్ బ్రాండ్, పూజా హెగ్డే సాంగ్, అనిరుద్ మ్యూజిక్ లాంటి అట్రాక్షన్లు వార్ 2లో లేకపోవడంతో భారం మొత్తం తారక్ మీదే పడింది. బెనిఫిట్ షోలు కేవలం ఆ పేరు మీదే ఫుల్ అవుతున్నాయి .

ఇప్పటికి ట్రెండ్ ఎలా ఉన్నా రేపు మార్నింగ్ షోలు అయ్యాకే ఎవరు మొదటి విజేత అవుతారనేది తేలుతుంది. కూలి ఇప్పటికే యుఎస్ లో రెండు మిలియన్లు దాటేయగా వార్ 2 మిలియన్ వైపు వెళ్తోంది కానీ నడక నెమ్మదిగా ఉంది. నార్త్ లో చూసుకుంటే హృతిక్, తారక్ కాంబినేషన్ పని చేస్తోంది. క్రమంగా బుకింగ్స్ పెరుగుతున్న వైనం సేల్స్ లో కనిపిస్తోంది. హిందీ ఫ్లేవర్ ఎక్కువగా అనిపించడం వల్ల ఏపీ తెలంగాణ బిసి సెంటర్స్ లో కొంచెం మూమెంట్ తక్కువగా ఉంది. అయినప్పటికీ ప్రీమియర్ షో అయ్యాక బయటికొచ్చే ఫాన్స్ తీసుకెళ్లే టాక్ దాని అసలు స్టేటస్ ని డిసైడ్ చేయబోతోంది.

మొత్తం స్టేట్ వైడ్ థియేటర్లన్నీ కిక్కిరిసిపోవడం ఖాయం. ఎల్లుండి ఇండిపెండెన్స్ డే ఉన్న నేపథ్యంలో రేపటి షోలకు దేనికీ టికెట్లు దొరికే పరిస్థితి లేదు. రెండింటికి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం డిస్ట్రిబ్యూటర్లు చూడబోయేది మాములు పండగ కాదు. ఏపీలో టికెట్ రేట్ల పెంపు ఉన్నప్పటికీ టాక్ బాగున్నప్పుడు ప్రేక్షకులు హైక్ ని అంగీకరిస్తారనేది గతంలో ఋజువయ్యింది కాబట్టి ఇప్పుడు కూడా బయ్యర్లు అదే ధీమాతో ఉన్నారు. వంద కోట్ల గ్రాస్ లక్ష్యంతో కూలీ, నూటా ఎనభై కోట్లకు పైగా గ్రాస్ టార్గెట్ తో వార్ 2 బరిలో దిగుతున్న నేపథ్యంలో ఈ క్లాష్ కురిపించే కాసుల వర్షం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

This post was last modified on August 13, 2025 12:14 pm

Share
Show comments
Published by
Kumar
Tags: CoolieWar 2

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

3 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

4 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

4 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

5 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

6 hours ago