Movie News

రిలీజ్‌కు ముందే వంద కోట్లు

ఒకప్పుడు సౌత్ ఇండియాలో రజినీకాంత్‌ను మించిన స్టార్ లేడు అన్నట్లుండేది పరిస్థితి. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్‌లు, వసూళ్లు అన్నీ కూడా వేరే లెవెల్లో ఉండేవి. వంద కోట్ల వసూళ్లు వస్తే అద్భుతం అనుకునే రోజుల్లోనే ‘రోబో’ మూవీతో వందల కోట్ల వసూళ్లు తెచ్చిపెట్టిన ఘనత ఆయన సొంతం. ఐతే గత కొన్నేళ్లలో రజినీ నటించిన పలు చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ‘జైలర్’ను మినహాయిస్తే అన్నీ ఫెయిల్యూర్లే.

పేట, పెద్దన్న, వేట్టయాన్ లాంటి చిత్రాలకు అయితే అసలు హైపే లేదు. ‘జైలర్’ కూడా రిలీజ్ తర్వాతే పుంజుకుంది. కానీ సూపర్ స్టార్ కొత్త చిత్రం ‘కూలీ’ సంగతి మాత్రం వేరు. ఈ సినిమా మొదలైన దగ్గర్నుంచే మంచి హైప్ తెచ్చుకుంది. రిలీజ్ టైంకి ఆ హైప్ మల్టిప్లై అయింది. గత కొన్నేళ్లలో ఇంత హైప్ తెచ్చుకున్న సినిమా ఇంకోటి లేదు అనే పరిస్థితి కనిపిస్తోంది.

‘కూలీ’కి అడ్వాన్స్ బుకింగ్స్ అలా జరుగుతున్నాయి మరి.
‘కూలీ’ ఫస్ట్ షో పడడానికి ముందే వసూళ్లు రూ.100 కోట్లను టచ్ చేసేలా కనిపిస్తుండడం విశేషం. ఇప్పటికే వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఈ చిత్రం రూ.70 కోట్ల దాకా రాబట్టింది. సినిమా రిలీజ్ కావడానికి ఇంకా ఒక రోజు పైన సమయం ఉంది కాబట్టి.. ఆలోపు బుకింగ్స్‌తో రూ.100 కోట్ల మార్కును టచ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే వంద కోట్ల వసూళ్లంటే మామూలు విషయం కాదు. ఇక రిలీజ్ రోజు వసూళ్లను కూడా కలుపుకుంటే ‘కూలీ’ డే-1 రూ.150 కోట్ల మార్కును కూడా దాటే అవకాశముంది. తమిళ సినిమా ఓపెనింగ్ రికార్డులన్నింటినీ ఈ చిత్రం బద్దలు కొట్టడం లాంఛనమే. అమెరికాలో ఆల్రెడీ ఈ చిత్రం 3 మిలియన్ ప్రి సేల్స్‌కు చేరువగా ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ వసూళ్లు కూడా అనూహ్యంగా ఉంటాయన్నది స్పష్టం. వెయ్యి కోట్ల సినిమా కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కోలీవుడ్‌ ‘కూలీ’తో ఆ మార్కును టచ్ చేస్తుందనే అంచనాలున్నాయి. కావాల్సిందల్లా పాజిటివ్ టాకే.

This post was last modified on August 12, 2025 6:07 pm

Share

Recent Posts

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

23 minutes ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

27 minutes ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

2 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

3 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

4 hours ago

జనాలు పట్టేశాక నిజాలు ఒప్పుకుంటే ఎలా?

ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…

4 hours ago