అక్కినేని నాగార్జునను చూసిన ఎవ్వరికైనా ఆయన వయసు 65 ఏళ్లని ఎంతమాత్రం అనిపించరు. ఇప్పటికీ ఎంతో ఫిట్‌గా, కుర్రాళ్లకు దీటైన లుక్స్‌తో దర్శనమిస్తుంటారాయన. తన కొత్త చిత్రం కూలీలోనూ నాగ్ సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. నాగ్ ఏదైనా ఈవెంట్‌కు హాజరైనా, మీడియాకు ఇంటర్వ్వూ ఇచ్చినా ఆయన ఫిట్‌నెస్ గురించి ప్రశ్నలు ఉంటాయి. వాటికి ఆయన సమాధానం ఇస్తుంటారు. సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం నాగ్‌ను ఇదే ప్రశ్న అడిగాడట కూలీ షూటింగ్ టైంలో కలిసినపుడు. నాగ్ ఫిట్‌నెస్ చూసి తాను ఎంత అబ్బురపడ్డానో.. యవ్వన రహస్యం గురించి తాను అడిగితే నాగ్ ఏం సమాధానం ఇచ్చాడో చెన్నైలో జరిగిన కూలీ అన్‌లీష్డ్ ఈవెంట్లో రజినీ వెల్లడించారు.
తాను, నాగార్జున నాట్టుకు ఒరు నల్లవన్ అనే సినిమాలో కలిసి నటించామని.. మళ్లీ 34-35 ఏళ్ల తర్వాత కూలీ కోసం కలిసి పని చేశామని రజినీ చెప్పాడు. నాగ్ తనలాగే ఎక్కువ బయటికి రాడు కాబట్టి మళ్లీ కలిసే అవకాశం రాలేదని.. చాలా ఏళ్ల పాటు తనను చూడలేదని రజినీ తెలిపాడు. ఐతే కూలీ కోసం పని చేస్తున్నపుడు చూస్తే అప్పటికంటే నాగ్ ఇప్పుడు ఇంకా యంగ్‌గా కనిపించాడని.. తన ఫిట్‌నెస్, స్కిన్ టోన్, జుట్టు చూసి ఆశ్చర్యపోయానని రజినీ చెప్పాడు. తన లాంటి వాళ్లకు జుట్టు మొత్తం ఊడిపోతే.. నాగ్‌కు ఇంకా పొడవైన జుట్టు ఉందని.. ఇలా ఎలా మెయింటైన్ చేస్తున్నాడో అర్థం కాక ఆ సీక్రెట్ ఏంటో చెప్పమని తాను అడిగానని రజినీ చెప్పాడు.
అందుకు నాగ్ బదులిస్తూ.. 40-45ఏళ్లుగా తాను ఎప్పుడూ వ్యాయామం మానలేదని. ప్రతి రోజూ ఎక్సర్‌సైజ్ తప్పని సరి అని చెప్పాడని రజినీ వెల్లడించాడు. దీంతో పాటు ఆరోగ్యవంతమైన తిండి తినడం.. సాయంత్రం ఆరున్నరకే డిన్నర్ పూర్తి చేయడం.. ఏ టెన్షన్స్ పెట్టుకోకపోవడం.. అన్నింటికీ మించి తన తండ్రి నాగేశ్వరరావు నుంచి వచ్చిన జీన్స్ తాను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణాలని నాగ్ వెల్లడించినట్లు రజినీ తెలిపాడు. మన ఒంట్లో అవయవాలను కాపాడుకోవడానికి ఎక్సర్‌సైజ్ ఎంతో ముఖ్యం అని ఈ సందర్భంగా నాగ్‌ను ఉదాహరణగా చూపిస్తూ అభిమానులకు సలహా ఇచ్చాడు.
This post was last modified on August 12, 2025 11:34 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…