Movie News

ఈసారి ‘బిగ్ బాస్’లో బిగ్ బాస్ మారిపోయాడా?

లండన్‌లో ‘బిగ్ బ్రదర్’ పేరుతో మొదలై రియాలిటీ టీవీ షో.. ఆ తర్వాత హిందీలో ‘బిగ్ బాస్’ పేరుతో అరంగేట్రం చేసి.. ఆపై సౌత్ భాషల్లోకి కూడా అడుగు పెట్టింది. తెలుగులో ఇప్పటికే 8 సీజన్ల పాటు అలరించిన ఈ షో.. తొమ్మిదో సీజన్‌తో పలకరించబోతోంది. గత ఆరు సీజన్లలో షోను నడిపించిన అక్కినేని నాగార్జుననే ఈ సీజన్లో కూడా హోస్ట్‌‌గా వ్యవహరించబోతున్నాడు. త్వరలోనే కంటెస్టెంట్లను ప్రకటించనుండగా.. ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ ప్రోమో వదిలారు.

అందులో నాగ్‌తో పాటు స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా కనిపించడం విశేషం. తాను కూడా షోలో పాల్గొనాలని కిషోర్ ఉత్సాహంగా వస్తే.. అతడికి షాకుల మీద షాకులు ఇచ్చాడు నాగ్. ఇప్పటిదాకా జరిగిన సీజన్లన్నింటితో పోలిస్తే బిగ్ బాస్-9 చాలా భిన్నంగా ఉండబోతోందని ఈ ప్రోమోతో సంకేతాలు ఇచ్చారు. ఇది డ్రీమ్ హౌస్ కావచ్చు కానీ, సేమ్ హౌసే కదా అని కిషోర్ అంటే.. ‘‘నాట్ ఎనీ మోర్.. ఈసారి డబుల్ హౌస్ డబుల్ డోస్’’ అని నాగ్ పేర్కొన్నాడు. దీన్ని బట్టి ఈసారి షోలో రెండు హౌస్‌లు ఉంటాయని అర్థమవుతోంది. 

ఇలా ఇద్దరి మధ్య సంభాషణ కొనసాగి.. చివరికి ‘‘నేను డైరెక్ట్‌గా బిగ్ బాస్‌తోనే మాట్లాడుకుంటా’’ అని కిషోర్ అంటే.. ‘‘ఈసారి బిగ్ బాస్‌నే మార్చేశాం.. అందరి సరదాలు తీరిపోతాయి.. ఈసారి చదరంగం కాదు రణరంగమే’’ అని నాగ్ అనడంతో ప్రోమో ముగిసింది. ఇందులో ‘‘బిగ్ బాస్‌నే మార్చేశాం’’ అనే మాట ఆసక్తి రేకెత్తిస్తోంది. అంటే ‘బిగ్ బాస్’ కొత్త వాయిస్‌తో వినిపించనుందా.. లేక ఇంకేదైనా మార్పు చేశారా అన్నది ప్రశ్న. ఈసారి షోలో సెలబ్రెటీల కంటే సామాన్యులే ఎక్కువమంది ఉంటారని ఇప్పటికే హింట్ ఇచ్చారు. ‘బిగ్ బాస్-9’ వచ్చే నెల నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on August 11, 2025 12:10 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Bigg Boss 9

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago