హృతిక్ రోషన్ పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్. తొలి సినిమా ‘కహోనా ప్యార్ హై’తోనే పెద్ద స్టార్ అయిపోయిన హీరో అతను. అప్పట్నుంచి టాప్‌లోనే ఉంటూ వస్తున్నాడు. అలాంటి హీరో.. మన జూనియర్ ఎన్టీఆర్‌ను కొనియాడిన తీరు టాలీవుడ్‌కే గర్వకారణం అని చెప్పాలి. తారక్ తనకు గురువు అన్నట్లుగా ‘వార్-2’ ప్రి రిలీజ్ ఈవెంట్లో హృతిక్ మాట్లాడాడు. తారక్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని.. అందుకు అతడికి కృతజ్ఞుడినని హృతిక్ పేర్కొన్నాడు. తారక్‌ది, తనది ఒకే రకమైన ప్రయాణం అని.. అతడిలో తనను చూసుకుంటానని హృతిక్ చెప్పాడు.
అలాగే తారక్ కూడా తనలో అతణ్ని చూసుకుంటాడనుకుంటున్నట్లు చెప్పాడు. తారక్, తాను కోస్టార్లుగా మొదలుపెట్టి.. సోదరులం అయిపోయామని.. ఇప్పుడు తన అభిమానులు కూడా తన సోదరులే అని హృతిక్ వ్యాఖ్యానించాడు. ఇక తారక్ ప్రతిభ గురించి హృతిక్ గొప్ప ఎలివేషనే ఇచ్చాడు. తారక్ వన్ టేక్-ఫైనల్ టేక్ స్టార్ అని హృతిక్ అన్నాడు. ఒక పాత్రలోకి అతను లీనమయ్యే తీరు అద్భుతమని.. షాట్‌లోకి వెళ్లాడంటే నూటికి నూరు శాతం దాని కోసం ఏం చేయాలో అది చేస్తాడని.. 99.9 కూడా కాదు 100 పర్సంట్ ఇస్తాడని హృతిక్ కొనియాడాడు.
సన్నివేశం పూర్తయ్యాక దాన్ని జడ్జ్ చేసే అవకాశమే ఉండదని.. పర్ఫెక్ట్‌గా ఉంటుందని హృతిక్ చెప్పాడు. తారక్‌లోని ఈ లక్షణాలను తాను కూడా నేర్చుకున్నానని.. తన తర్వాతి చిత్రాల్లో వాటిని అమల్లో పెట్టడానికి ప్రయత్నిస్తానని హృతిక్ అన్నాడు. తారక్ వ్యక్తిగా ఎంతో స్ట్రాంగ్ అని.. ‘వార్-2’ చేస్తూ తామిద్దరం ఎన్నో దెబ్బలు కూడా తిన్నామని.. కానీ తారక్ దృఢంగా నిలవడం చూసి తాను ఇన్‌స్పైర్ అయ్యానని.. అది తనలో నేర్చుకున్న మరో విషయం అని హృతిక్ చెప్పాడు. వార్-2 తన కెరీర్లో టాప్‌లో ఉంటుందని.. కహోనా ప్యార్ హై, క్రిష్, ధూమ్-2 చిత్రాలకు ఎంత అప్రిషియేషన్ వచ్చిందో ‘వార్’కు అంత పొగడ్తలు వచ్చాయని.. ‘వార్-2’ కూడా అదే స్థాయిలో స్పందన తెచ్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు హృతిక్.
This post was last modified on August 10, 2025 11:35 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…