తమ అభిమాన కథానాయకులను ఫ్యాన్స్ ఎంతగా ఆరాధిస్తారో.. వాళ్లను ఒక్కసారి నేరుగా చూడాలని ఎంతగా తపిస్తారో.. ఆ అవకాశం దక్కినపుడు ఎంత ఉద్వేగానికి గురవుతారో చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ అలాంటి అభిమానులను పెద్ద సంఖ్యలోనే సంపాదించుకున్నాడు. వీలైనపుడల్లా అభిమానులను కలిసి వారి కళ్లలో ఆనందం చూసేందుకు ప్రయత్నిస్తుంటాడు తారక్. ఐతే గత కొన్నేళ్లలో తారక్ చేసిన సినిమాలు తక్కువ కావడంతో ఎక్కువగా అభిమానులను కలిసే అవకాశం రాలేదు. పైగా ‘దేవర’ సినిమాకు ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా జరగకపోవడంతో ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు.
ఐతే తారక్ బాలీవుడ్లోకి అడుగు పెడుతున్న ‘వార్-2’ సినిమాకు ఆదివారం హైదరాబాద్‌లో భారీ ప్రి రిలీజ్ ఈవెంట్ చేశారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ హాజరయ్యారు. ఐతే పాసులు పరిమితం కావడంతో కోరుకున్న వాళ్లందరూ ఈ వేడుకకు రాలేకపోయి ఉండొచ్చు. కానీ ఒక స్పెషల్ ఫ్యాన్ మాత్రం ఈ ఈవెంట్‌కు హాజరై తన చిరకాల కోరిక నెరవేర్చుకున్నాడు. ఆ అభిమాని పుట్టు మూగవాడు, చెవిటి వాడు కావడం గమనార్హం. ఎన్టీఆర్ కోసం గుంటూరు జిల్లా మాచర్ల నుంచి వచ్చిన ఆ అభిమానికి ముందు ‘వార్-2’ ఈవెంట్ పాస్ దక్కలేదు.
దీని గురించి ఒక టీవీ ఛానెల్‌తో మొరపెట్టుకున్నాడు. అతణ్ని ఇంటర్వ్యూ చేసినపుడు సైగలతోనే ఎన్టీఆర్ మీద తన అభిమానం ఎలాంటిదో చాటి చెప్పాడు. తనకు ఈవెంట్ పాస్ లేని విషయాన్ని మీడియా ద్వారా తెలియజేయగా.. సోషల్ మీడియాలో దాన్ని ఫ్యాన్స్ వైరల్ చేశారు. ఎన్టీఆర్ పీఆర్ టీం ఈ పోస్టుకు స్పందించింది. అతడికి పాస్ ఇప్పించడమే కాదు.. తారక్‌ను కలిసే అవకాశం కూడా కల్పించింది. జూనియర్‌తో కలిసి ఫొటోలు దిగిన అతడి ఆనందానికి అవధుల్లేవు. ఈ ఫొటోలు చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ అభిమానిలాగే ఎగ్జైట్ అవుతున్నారు.
This post was last modified on August 10, 2025 9:41 pm
2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తామే విజయం దక్కించుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…
మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…