తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఉద్యోగులు, ఫిలిం ఛాంబర్ పెద్దల మధ్య వేతనాలకు సంబంధించి జరుగుతున్న వివాదం అంత సులభంగా తేలేలా లేదు. వేతనాల్లో 30 శాతం పెంపు ఇచ్చి తీరాల్సిందేనని కార్మిక నాయకులు పట్టు మీదుండగా, అలా సాధ్యం కాదని వర్కర్ ఆదాయంని బట్టి స్లాట్స్ ప్రకారం పెంచుకుంటూ వెళ్తామని నిర్మాతలు ప్రతిపాదించారు. అయితే రెండు వర్గాలు ఏకాభిప్రాయం మీదకు రాకపోవడంతో సమస్య ఇంకా జఠిలంగానే ఉంది. ఎక్కడ లేని జీతాలు టాలీవుడ్ లోనే ఉన్నాయని ఇండస్ట్రీ పెద్దల వాదన. లేదూ తమకు పెంచడం న్యాయమేనని, ఏళ్ళ తరబడి హైక్ లేదని కార్మికులు వాదిస్తున్నారు.
షూటింగులు ఎక్కడికక్కడ ఆగిపోవడం చిన్నా పెద్ద ప్రొడ్యూసర్లకు భారంగా మారింది. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ రిలీజ్ డేట్లు ప్రకటించుకున్న సినిమాలు డెడ్ లైన్ ని చేరుకుంటామో లేదోననే ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకవేళ తేదీలు మిస్ అయితే ఓటిటి నుంచి ఒత్తిళ్లు, అడ్వాన్సుల కోసం బయ్యర్ల నుంచి ప్రెజర్లు మొదలవుతాయి. వీటికి తోడు మళ్ళీ కొత్త డేట్ వేసుకోవడం పెద్ద తలనెప్పిగా మారుతుంది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు నిర్మాతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నా పనవ్వడం లేదు. వీలైనంతగా నాలుగైదు రోజుల్లోపు దీనికో ముగింపు దక్కాలని పరిశ్రమ వర్గాలు కోరుకుంటున్నాయి. నిన్న నిర్మాతలంతా తీసుకున్న ఒక నిర్ణయాన్ని కూడా కార్మిక సంఘాలు తిరస్కరించాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే తనను ఏ ఫెడరేషన్ నాయకులు సంప్రదించలేదని, సాల్వ్ చేయాల్సింది ఫిలిం ఛాంబరేనంటూ, తన ప్రమేయం ఆశించవద్దంటూ చిరంజీవి చేసిన ట్వీట్ సైతం చిన్నపాటి సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడు పెద్దగా ఎవరు ముందుకు వచ్చి ఈ గొడవకు శుభం కార్డు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ పరస్పరం ఒకే పట్టుతో ఉండటం వల్ల థర్డ్ పార్టీ (మూడో వ్యక్తి) ప్రమేయం అవసరమవుతోంది. అది ఎవరైనా మంత్రి రూపంలో వస్తారా లేక ఇంకెవరైనా అగ్ర హీరో చొరవ తీసుకుంటారా అనేది ఇంకొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on August 10, 2025 10:22 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…