టాలీవుడ్లో ప్రస్తుతం నంబర్ వన్ కమెడియన్ అంటే వెన్నెల కిషోర్ పేరే చెప్పాలి. దశాబ్దాల పాటు హవా సాగించిన లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం గత కొన్నేళ్లలో డౌన్ అయ్యారు. ఆయన ప్రైమ్‌లో ఉండగానే కమెడియన్‌గా రైజ్ అయిన కిషోర్.. తర్వాత అవకాశాల్లో బ్రహ్మిని దాటేసి ముందుకు వెళ్లిపోయాడు. ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గ టైమింగ్‌తో నవ్వించడంలో కిషోర్ దిట్ట. టాలీవుడ్ చరిత్రలోనే బెస్ట్ కమెడియన్లలో అతడి పేరు ఉంటుందనడంలో సందేహం లేదు. ఐతే కామెడీలో ఇంతగా ఆరితేరిన కిషోర్.. అసలు నటనలోకే రావాలనుకోలేదట. అతడి లక్ష్యం దర్శకుడు కావడం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయడమేనట.
తన తొలి చిత్రం వెన్నెలలో ఖాదర్ అనే కామెడీ పాత్ర పోషించడం అనుకోకుండా జరిగిందట. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు దేవా కట్టా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
వెన్నెల సినిమాను చాలా వరకు అమెరికాలోనే చిత్రీకరించిన సంగతి తెలిసిందే. కిషోర్ దేవా కట్టాకు స్నేహితుడు కాగా.. ఈ సినిమాకు అసిస్టెంట్‌గా పని చేసి మేకింగ్‌లో సాయం చేయడానికి అతను వచ్చాడట. దర్శకుడిగా మారి పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలని లక్ష్యంగా పెట్టుకున్న కిషోర్.. అనుభవం కోసమే ఈ సినిమాకు పని చేశాడట.
తన చిత్రానికి బడ్జెట్ తక్కువ కావడంతో ఉచితంగా పని చేసేవాళ్లు అవసరం అన్న ఉద్దేశంతో కిషోర్‌ను తీసుకున్నాడట దేవా. ఐతే వీసా సమస్య వల్ల ఖాదర్ పాత్ర చేయాల్సిన శివారెడ్డి అమెరికాకు రాలేకపోవడంతో ఇబ్బంది తలెత్తినట్లు దేవా చెప్పాడు. ఖాదర్ చాలా ముఖ్యమైన పాత్ర కావడంతో ఆ క్యారెక్టర్ చేయాల్సిన నటుడు రాకుంటే సినిమానే సగం చచ్చిపోయే పరిస్థితి వచ్చిందని.. ఆ పరిస్థితుల్లో కిషోర్‌తో ఆ పాత్ర చేయించామని దేవా తెలిపాడు. ఐతే ముందు అందుకు కిషోర్ ఒప్పుకోలేదని.. డైరెక్షనే తన లక్ష్యమని చెప్పాడని.. కానీ ఈ సినిమా చేస్తే ఇండస్ట్రీలోకి వెళ్లేందుకు మార్గం దొరుకుతుందని ఒప్పించి ఆ పాత్రను కిషోర్‌తో చేయించినట్లు దేవా వెల్లడించాడు.
This post was last modified on August 9, 2025 7:04 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…