టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ యాక్టర్స్ లో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతిభ పుష్కలంగా ఉన్నా బ్రేక్ అందుకోవడంలో పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. చిరంజీవి గాడ్ ఫాదర్ లో విలన్ గా నటించేందుకు వెనుకాడలేదు. కింగ్డమ్ లో చనిపోయే హీరో అన్నయ్యగా ఎస్ చెప్పాడు. కానీ ఫలితాలు దక్కడం లేదు. నటన పరంగా ప్రశంసలు దక్కుతున్నాయి కానీ అవి కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడం ఇబ్బంది పెడుతోంది. ఈ కారణంగానే సత్యదేవ్ తో సినిమాలు కొన్ని చివరి దశ దాకా వచ్చి ఓటిటి డీల్స్, థియేటర్ బిజినెస్ కోసం ఆలస్యమవుతున్న దాఖలాలున్నాయి.
తాజాగా అరేబియా కడలి అనే వెబ్ సిరీస్ తో సత్యదేవ్ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తండేల్ కథే ఇది. కాకపోతే కాపీ రైట్స్ విషయంలో రేగిన గందరగోళం వల్ల ఒకే కథ రెండుసార్లు తెరకెక్కింది. ఒకవేళ తండేల్ ఫ్లాప్ అయ్యుంటే ఇప్పుడు సత్యదేవ్ కి అడ్వాంటేజ్ అయ్యేది. కానీ అది సూపర్ హిట్ కావడంతో పాటు వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది. టీవీలో మంచి టిఆర్పి వచ్చింది. అందరూ చూసేసిన స్టోరీ మళ్ళీ వెబ్ సిరీస్ గా రావడంతో ఆడియన్స్ లో అంతగా ఆసక్తి కనిపించలేదు. పైగా తండేల్ కథనే విడమరిచి డిటైల్డ్ గా చెప్పారు తప్పించి దానికన్నా బావుందని చెప్పే అవకాశం అరేబియా కడలి టీమ్ ఇవ్వలేదు.
ఇండస్ట్రీలో సక్సెస్ ఎంత ముఖ్యమో చెప్పేందుకు సత్యదేవ్ ఉదాహరణ చాలు. కొన్నిసార్లు అదృష్టం కలిసి రావాలి. ఒకవేళ ఇదే ఉండి ఉంటే అరేబియా కడలి ముందు రిలీజై మంచి పేరు తెచ్చేదేమో. ఆర్టిస్టుగా సత్యదేవ్ బిజీగానే ఉన్నాడు. ఒకప్పటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇప్పుడు హీరోగా మారిపోయాడు కానీ హిట్లు వరసగా పడితే కెరీర్ ఊపందుకుంటుంది. ఆ బ్రేక్ కోసమే అతను ఎదురు చూస్తున్నాడు. గాడ్ ఫాదర్ పెద్దగా ఆడకపోయినా దాని వల్ల ఆఫర్లు చాలా వచ్చాయి. కానీ అన్నీ ఒకే తరహాలో ఉండటంతో తిరస్కరిస్తూ వచ్చాడు. తను హీరోగా నటించిన ఫుల్ బాటిల్ రెండేళ్లుగా వాయిదా పడి రిలీజ్ కు రెడీ అవుతోంది.
This post was last modified on August 8, 2025 6:31 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…