Movie News

దేవ కట్ట పేరు మళ్ళీ వినిపిస్తోంది

ప్రస్థానం అనే ఒకే సినిమాతో కల్ట్ దర్శకుల లిస్టులో చేరిపోయిన దేవ కట్ట ఆ తర్వాత ఆటో నగర్ సూర్య మీద ఏర్పడ్డ భారీ అంచనాలను అందుకోలేక వెనుకబడిన మాట వాస్తవం. ఆ తర్వాత మంచు విష్ణుతో చేసిన డైనమైట్ అసలది వచ్చిన సంగతే గుర్తు లేనంతగా ఫ్లాప్ అయ్యింది. ప్రస్థానం హిందీ రీమేక్ చేయడం మరో చేదు జ్ఞాపకం ఇచ్చింది. అయినా సరే సాయి ధరమ్ తేజ్ నమ్మకంతో ఇచ్చిన రిపబ్లిక్ సైతం ఆశించిన ఫలితం అందుకోలేదు. కంటెంట్ పరంగా ప్రశంసలు వచ్చాయి కానీ అన్ని వర్గాలను మెప్పించేలా కంటెంట్ లేకపోవడంతో మళ్ళీ గ్యాప్ తీసుకున్నారు. ఇదంతా నాలుగేళ్ల క్రితం ముచ్చట.

తాజాగా మయసభ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు దేవ కట్ట. దర్శకత్వంలో కిరణ్ జయ్ కుమార్ భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఎక్కువ వినిపిస్తున్న పేరు దేవ కట్టదే. పైకి కల్పిత కథగా చెప్పుకున్నప్పటికీ వైఎస్ఆర్, చంద్రబాబునాయుడులను స్ఫూర్తిగా తీసుకుని తీశారనేది చిన్నపిల్లాడు సైతం గుర్తు పట్టేస్తున్నాడు. ఇప్పుడీ సిరీస్ లోని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఇద్దరితో పాటు స్వర్గీయ ఎన్టీఆర్ ను గుర్తు చేసేలా ఉన్న కొన్ని సీన్లను క్లిప్స్ రూపంలో కట్ చేసి ఎక్స్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో షేర్ చేసుకుంటున్నారు. నిమిషాల్లోనే ఇవి వైరల్ అవుతున్నాయి.

కంటెంట్ లో నిజానిజాలు ఎన్ని ఉన్నాయనేది పక్కనపెడితే దేవా కట్టలోని రియల్ ఫిలిం మేకర్ మరోసారి కనిపించిన మాట వాస్తవం. సన్నివేశాల్లో డెప్త్ ని, ఎమోషన్ ని, అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించే ఆర్ట్ వర్క్ ని చూపించిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తోంది. తొమ్మిది ఎపిసోడ్లు మొత్తం ఏడు గంటల నిడివి ఉన్నప్పటికీ విసుగు రాకుండా స్క్రీన్ ప్లే నడిపించడంతో మౌత్ టాక్ మెల్లగా పాకుతోంది. వివాదాలు కూడా వచ్చేలా ఉన్నాయి. ఆది పినిశెట్టి, చైతన్యరావు, సాయికుమార్, నాజర్ లాంటి క్యాస్టింగ్ ఆడియన్స్ ని ఒక లుక్ వేసేలా చేస్తోంది సెకండ్ సీజన్ కు అవసరమైన బజ్ ని క్రియేట్ చేయడంలో మయసభ సక్సెస్ అయినట్టే.

This post was last modified on August 8, 2025 12:17 pm

Share

Recent Posts

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

49 minutes ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

1 hour ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

2 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

4 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

4 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

5 hours ago