ఇండస్ట్రీలో దోపిడీ వ్యవస్థ లేదంటే అంతకంటే కామెడీ మరొకటి ఉండదేమో. చాప కింద నీరులా నిర్మాతలను పీల్చేస్తున్న వ్యవస్థలో బయటికి కనిపించకుండా బలవుతున్న వారు ఎందరో. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఈ విషయంలో తన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ మధ్య వేతనాలకు సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆయన చెబుతున్న కొన్ని విషయాలు షాకింగ్ గా ఉన్నాయి. ఇంత టాప్ ప్రొడ్యూసర్ అయ్యుండి, రాజా సాబ్ – మిరాయ్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ చేతిలో పెట్టుకుని కూడా వెతలు పడాల్సి వస్తోందంటే దానికి కారణం ఎవరు.
మా ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కొన్ని సీరియస్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేశారు. ఉదాహరణకు విఎఫెక్స్ సూపర్ వైజింగ్ ఎంత దారుణంగా తయారయ్యిందో ఆయన నిర్మించిన రెండు సినిమాలను ఎగ్జాంపుల్స్ గా చెప్పారు. కార్తికేయ 2, బ్రోకు ఆశించిన స్థాయిలో తమకు విజువల్ ఎఫెక్ట్స్ డెలివరీ కాలేదని, దానికి టెర్రరిస్టు లాంటి అంతర్గత మాఫియాలే కారణమని, నేను పెట్టిన ఖర్చు తగ్గ క్వాలిటీ ఇవ్వకపోవడం వల్ల ఆ రెండు చిత్రాల అవుట్ ఫుట్ నాణ్యత తగ్గిందని చెప్పారు. కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ అయినప్పటికీ కొన్ని బ్లాక్స్ కు సంబంధించి సిజి ఇంకా బెటర్ గా ఉండాల్సిందని ఒప్పుకున్నారు.
కన్నప్ప టైంలోనూ మంచు విష్ణు ఇదే పాయింట్ మీద తన అసంతృప్తిని వ్యక్తం చేయడం గుర్తు చేసుకోవాలి. విఎఫ్ఎక్స్ సూపర్ వైజ్ చేసే బాధ్యతను ఒక తప్పుడు వ్యక్తికి ఇవ్వడం వల్ల అనుకున్న టైంని ఫైనల్ కాపీ సిద్ధం చేసుకోలేకపోయామని, అందుకే ఆ పని వేరేవాళ్లకు అప్పగించి రిలీజ్ చేయడానికి ఎక్కువ టైం పట్టిందని అన్నారు. ఇప్పుడు టిజి విశ్వప్రసాద్ ఇదే టాపిక్ మీద కంప్లైంట్ చేయడం గమనార్హం. ఈ మధ్య పెద్ద హీరోల ప్యాన్ ఇండియా సినిమాలు సైతం విఎఫ్ఎక్స్ పరంగా దారుణమైన ఫలితాలు అందుకుంటున్నాయి. దీన్ని బట్టే ఇదెంత ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన విభాగమో అర్థమవుతుంది.
This post was last modified on August 7, 2025 6:31 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…