విజయ రామరాజు టైటిల్ రోల్ లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. మేకర్స్ ఇప్పుడు ఓ హార్ట్ టచ్చింగ్ లవ్ సాంగ్ తో మ్యూజికల్ ప్రోమోషన్స్ కు శ్రీకారం చుట్టారు.
‘మేఘం వర్షించదా’ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ ని మాయ చేస్తోంది. విఘ్నేష్ బాస్కరన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ హత్తుకునే మెలోడీగా అలరిస్తోంది.
విక్రాంత్ రుద్ర రాసిన పదాలు, కపిల్ కపిలన్, మీరా ప్రకాష్, సుజిత్ శ్రీధర్ గళాలు కలిసి ఈ పాటను మరింత మెస్మరైజ్ చేశాయి. ప్రేమలో ఉండే ఎమోషన్లను, ఆత్మీయతను ఈ పాట ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా విజయరామరాజు, సిజా రోజ్ మధ్య కనిపించే కెమిస్ట్రీ ఈ పాటలో హైలైట్‌గా నిలుస్తోంది.
ఈ పాట సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఫీలింగ్స్ తో నిండిన ట్యూన్, హార్ట్ టచింగ్ లిరిక్స్, విజువల్స్ తో ఇటీవలి కాలంలో వచ్చిన బెస్ట్ లవ్ సాంగ్స్‌లో ఈ పాట ఒకటిగా నిలుస్తోంది.
ఇక ఇప్పటికే 46 అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్న ఈ సినిమా ఇటీవల విడుదలైన టీజర్ తో మరింత మంచి స్పందన తెచ్చుకుంది. టీ జర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్లు వ్యూస్ తెచ్చుకుంది. యూట్యూబ్ లో 1.5 మిలియన్లు వ్యూస్ దాటింది.
కబడ్డీ ఆటగాడి జీవితం ఆధారంగా రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో, ప్రేమ కూడా అంతే బలంగా ఉండబోతుందని ఈ పాట స్పష్టంగా చెప్పింది.
‘మేఘం వర్షించదా’ సాంగ్ సినిమా పట్ల అంచనాలను పెంచేసింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘అర్జున్ చక్రవర్తి’ ప్రేమికుల మనసుల్లో స్థానం సంపాదించబోతున్నట్టు ఈ లవ్ సాంగ్ తో స్పష్టమైయింది.
This post was last modified on August 7, 2025 3:10 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…