సెన్సారు బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ తీసుకోవడం కూలీకి పెద్ద చేటు చేసేలా ఉంది. పివిఆర్ లైనక్స్, ఏజిఎస్ లాంటి మల్టీప్లెక్సులు 18 ఏళ్ళ లోపు పిల్లల్ని ఈ సినిమాకు తీసుకు రావొద్దంటూ ప్రత్యేక ప్రకటనలు ఇవ్వడం రజని ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. ఏజ్ ప్రూఫ్ లేకుండా అనుమతించడం సాధ్యం కాదని పేర్కొనడంతో టీనేజ్ అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. నిజానికి ఈ నిబంధన సింగల్ స్క్రీన్లకు కూడా వర్తిస్తుంది. కానీ వాటి యాజమాన్యాలు అంతగా పట్టించుకోవు. టికెట్లు తెగితే చాలని చిన్నా పెద్ద లేకుండా అందరిని పంపిస్తారు. కానీ చాలా మల్టీప్లెక్సులు ఈ కండీషన్ కఠినంగా పాటిస్తాయి. అసలు సమస్య ఇది కాదు.
రజనీకాంత్ అంటేనే వయసుతో సంబంధం లేకుండా అందరూ చూడాలని ఎగబడతారు. వాళ్ళను కంట్రోల్ చేయడం కష్టం. గతంలో సలార్ కు ఓ హైదరాబాద్ మల్టీప్లెక్సులో చిన్న పిల్లాడిని అనుమతించపోతే తల్లి అక్కడి సిబ్బందితో గొడవ పడిన వీడియో వైరల్ అయ్యింది. ఇప్పుడు కూలికి కూడా అలాంటి సీన్లు చూడబోతున్నాం. కూలికి ఇది అడ్డంకిగా మారి వార్ 2కి మేలు చేస్తుందేమోననే అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే వార్ 2లో కూడా వయొలెన్స్ ఉన్నప్పటికీ దానికి యు/ఏ దక్కింది. కాబట్టి ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరైనా చూడొచ్చు. కాకపోతే పెద్ద పర్యవేక్షణ ఉండాలి అంతే.
ఓపెనింగ్స్, ఫైనల్ రన్ రికార్డులు మీద భారీగా ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ కు ఇప్పుడీ ఏ సర్టిఫికెట్ సమస్యగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పివిఆర్ ఐనాక్స్ దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయబోతోంది. గతంలో ఎన్నో ఏ రేటెడ్ సినిమాలకు ఇవ్వని ప్రకటన ఇప్పుడు కూలికి ఎందుకు ఇస్తున్నారంటే కారణం సింపుల్. తండోప తండాలుగా వచ్చే ఆడియన్స్ మధ్యలో చిన్న పిలల్లను వెనక్కు పంపడం పెద్ద తలనొప్పి. అదేదో ముందే చెప్పేస్తే ఏ గొడవా ఉండదని ఇలా అనౌన్స్ మెంట్ ఇస్తున్నారు. సో 18 ఇయర్స్ బిలో ఎవరైనా సరే కూలి కోసం సింగల్ స్క్రీన్లు వెతుక్కోవడం తప్ప వేరే మార్గం లేదు.
This post was last modified on August 7, 2025 1:11 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…