చేసింది చివరి పది నిమిషాల్లో వచ్చే చిన్న పాత్రే అయినా కూలీని అమీర్ ఖాన్ చాలా పర్సనల్ గా తీసుకున్నాడని ముంబై మీడియా టాక్. ఆగస్ట్ 14 అదే రోజు విడుదల కాబోతున్న వార్ 2 కోసం యష్ రాజ్ ఫిలిమ్స్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రీమియమ్, ఐమాక్స్ స్క్రీన్లన్నీ బ్లాక్ చేసుకుంది. పోటీని దృష్టిలో ఉంచుకుని నిర్మాత ఆదిత్య చోప్రా ముందస్తుగా వేసిన మార్కెటింగ్ ఎత్తుగడ వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో కూలికి సరైన మద్దతు లేకుండా పోయింది. ఇది గమనించిన అమీర్ ఖాన్ స్వయంగా రంగంలోకి దిగి పివిఆర్ యజమాని అజయ్ బిజిల్ ని ఫోన్ ద్వారా సంప్రదించి కూలీకి మద్దతు ఇవ్వమని అడిగారట.
ముఖ్యంగా ప్రీమియర్ షోలకు సపోర్ట్ చేస్తే భారీ వసూళ్లు వస్తాయని, వార్ 2 ఉన్నప్పటికీ న్యాయం జరిగేలా పంపకాలు చేయమని అమీర్ అడిగే సరికి అజయ్ టీమ్ ఒక్కసారిగా షాక్ అయ్యిందట. ఎందుకంటే కూలిలో అమీర్ నిర్మాణ భాగస్వామి కాదు. అంతకంటే ముఖ్యంగా హీరో కూడా కాదు. కేవలం రజనీకాంత్ స్నేహం, మూడు దశాబ్దాల తర్వాత కలిసి నటించిన అనుభవం రెండూ వృథా కాకూడదని భావించి చొరవ తీసుకున్నట్టుగా నార్త్ ట్రేడ్ భావిస్తోంది. ఇప్పుడు పివీఆర్ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే యష్ రాజ్ తో పాటు అమీర్ సంబంధాలు కూడా తనకు అవసరమే.
మరో గమనించాల్సిన విషయం ఏంటంటే అమీర్ ఖాన్, అజయ్ బిజిల్ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. క్యామియో కాబట్టి కూలి కోసం తననేం అడగడులే అని భావించిన పివిఆర్ ఓనర్ కు ఇప్పుడు జరిగిన తాజా పరిణామం చిన్న పాటి షాక్ లాంటిది. విక్రమ్ లో రోలెక్స్ లాగా కూలిలో అమీర్ పోషించిన క్యారెక్టర్ గొప్పగా వచ్చిందని, ముఖ్యంగా ఫ్యాన్స్ ఈ కాంబోని తెరమీద చూసి వెర్రెక్కిపోతారని ఇన్ సైడ్ టాక్ ఉంది. ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని దాటించేసిన లోకేష్ కనగరాజ్ ట్రైలర్ తో పూర్తి స్థాయి మేజిక్ చేయనప్పటికీ హైప్ ఇంచు కూడా తగ్గకుండా చూసుకుంన్నాడు. ఆగస్ట్ 14 టాక్ రావడమే తరువాయి. రికార్డుల మోత షురూ.
This post was last modified on August 7, 2025 11:59 am
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…
హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…