దుర్గారావు.. సోషల్ మీడియా జనాలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. టిక్ టాక్‌లో సరదాగా డ్యాన్సులు చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదిచించుకున్నాడు ఈ గోదావరి వ్యక్తి. టిక్ టాక్‌కే తన జీవితాన్ని అంకితం చేసినట్లుగా ఆయన అందులో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. దుర్గారావు మాత్రమే కాదు.. ఆయన భార్య, మిగతా కుటుంబ సభ్యులు అందరూ కలిసి దాదాపు ప్రతి రోజూ టిక్ టాక్ వీడియోలు చేసేవాళ్లు. ఈ కుటుంబాన్ని ముందు కామెడీ చేసిన వాళ్లందరూ కూడా వాళ్ల వీడియోలను చూడకుండా ఉండలేనంతగా వాటికి ఎడిక్ట్ అయిపోయారు ఓ దశలో.
టిక్ టాక్ బ్యాన్ అయినా వీళ్ల సందడికేమీ లోటు లేకపోయింది. యూట్యూబ్‌లో ఒక ఛానెల్ పెట్టి మరీ ఎంటర్టైన్ చేస్తున్నారు. వీళ్లకున్న పాపులారిటీని టీవీ ఛానెళ్లు కూడా ఉపయోగించుకోవడం మొదలైంది. జబర్దస్త్ సహా చాలా టీవీ షోల్లో దుర్గారావు, ఆమె భార్య కనిపించారు.
తమ పాపులారిటీని మరో స్థాయికి తీసుకెళ్లడానికి దుర్గారావు, ఆయన భార్య రెడీ అయిపోయారిప్పుడు. ఇన్నాళ్లూ వాళ్లిద్దరూ పాపులర్ తెలుగు పాటలకు డ్యాన్స్ చేస్తుండేవాళ్లు. కానీ ఇప్పుడు వాళ్లే సొంతంగా ఓ పాట చేయడం విశేషం. ఆంధ్రా ప్రాంతంలో పాపులర్ అయిన ఓ జానపద గేయాన్ని వీళ్లిద్దరి మీద చిత్రీకరించారు. పెద్ద సెటప్‌తోనే ఆ పాట చిత్రీకరణ సాగిందని దాని ప్రోమో చూస్తే అర్థమవుతోంది.
ఈ పాటను ప్రముఖ యాంకర్, నటి రష్మి గౌతమ్ లాంచ్ చేసింది. ఆ సందర్భంగా దుర్గారావు జోడీ గురించి గొప్పగా మాట్లాడింది. ఇన్నాళ్లూ దుర్గారావు, ఆయన భార్య ఇమిటేషన్లే చేశారని.. ఇప్పుడు సొంతంగా పాట చేశారని.. ఇందులో దుర్గారావును ఆయన భార్య డామినేట్ చేసిందని.. ఆమె కోసమే ఈ పాట చూడండని ఆమె పేర్కొంది. పాట ప్రోమో చూస్తే దుర్గారావు మార్కు స్టెప్పులకు, అల్లరికి ఢోకా లేదని అర్థమవుతోంది. ఈ పాట హిట్టయితే మున్ముందు దుర్గారావు నుంచి ఇలాంటి ఒరిజినల్స్ మరిన్ని చూడొచ్చన్నమాట.
This post was last modified on November 19, 2020 7:47 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…