స్టార్ హీరోల సినిమాల్లో ఎంత మాస్ కోసమైనా సరే కొన్ని పరిమితులు పెట్టుకోవాల్సిందే. లేదంటే సోషల్ మీడియా యుగంలో కామెంట్లు తప్పవు. ప్రతిదీ శల్యపరీక్షకు గురవుతున్న ట్రెండ్ లో జాగ్రత్తగా ఉంటేనే నెగటివిటీ చేరకుండా ఉంటుంది. తాజాగా రవితేజ మాస్ జాతర నుంచి కొత్త సాంగ్ ‘ఓలే ఓలే గుంట నీ అయ్యకాడ ఉంటా’ రిలీజయ్యింది. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ పాటకు భాస్కర్ యాదవ్ సాహిత్యం అందించారు. ఏదో క్యాచీ పదాలతో ప్రాసల కోసం పాకులాడితే తప్పు లేదు కానీ మరీ ఊర నాటు స్టైల్ లో నీ యమ్మ, అక్క, తల్లి, చెల్లి, ఉంటా తింటా పంటా అంటూ ఏదేదో రాసేసి వాయిద్యాలతో హోరెత్తించేశారు.
దీని మీద మ్యూజిక్ లవర్స్ నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ధమాకా కాంబినేషన్ కావడంతో అంచనాలు మాములుగా లేవు. సాధారణంగా రవితేజ, శ్రీలీల డాన్స్ చేస్తుంటే ఆ ఎనర్జీ చూసేందుకు రెండు కళ్ళు చాలవు. పల్సర్ బైక్, దించక్ దించక్, దండడ్ కడియాల్ పాటలు అంత పెద్ద హిట్టవ్వడానికి కారణం వీళిద్దరి కెమిస్ట్రీనే. కానీ ఇప్పుడీ ఓలే ఓలేలో పదాల డామినేషన్ వల్ల ఆ జంట డాన్స్ పూర్తిగా ఎంజాయ్ చేయలేని పరిస్థితి. ఇలాంటి పాటలు రాయడానికి స్పెషలిస్ట్ గా పేరున్న కాసర్ల శ్యామ్ ని కాకుండా భాస్కర్ యాదవ్ ని ఎంచుకోవడం వెనుక ఉద్దేశం ఏదైనా మిక్స్డ్ రెస్పాన్స్ కు ఇదీ కారణమే.
దీనికి సమర్ధింపుగా ఎలాంటి సమాధానం వస్తుందనేది పక్కనపెడితే వైరల్ ప్రపంచంలో ఇలాంటివి హిట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పాట సంగతి అటుంచితే ఆగస్ట్ 27 విడుదలకు మాస్ జాతర రెడీ అవుతోంది. వాయిదా పడొచ్చనే ప్రచారాలకు చెక్ పెడుతూ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ వీడియో చివర్లో డేట్ మరోసారి కన్ఫర్మ్ చేసింది. స్టార్ రైటర్ గా పేరున్న భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రవితేజ గత సినిమాలు ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా మాస్ జాతరకు బిజినెస్ ఆఫర్స్ బాగున్నాయట. ట్రైలర్ వచ్చాక అవి మరింత పెరుగుతాయనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది.
This post was last modified on August 5, 2025 7:55 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…