గోట్ లైఫ్ ఆడు జీవితంలో అద్భుతంగా నటించిన పృథ్విరాజ్ సుకుమారన్ కు కాకుండా జవాన్ లాంటి కమర్షియల్ మూవీలో చేసిన షారుఖ్ ఖాన్ కు జాతీయ అవార్డు ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు రేగుతున్నాయి. కేవలం వివక్షతోనే ఇలా చేశారని ఊర్వశి లాంటి సీనియర్ నటీమణులు ఓపెన్ గా కామెంట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జ్యురి చైర్మన్ అశుతోష్ గోవారికర్ చేసిన కామెంట్లు అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యాయి. గోట్ లైఫ్ లో తమకు సహజత్వం కనిపించలేదని, టెక్నికల్ గా వీక్ గా ఉందని, అందువల్లే నేషనల్ అవార్డు ఇవ్వలేకపోయామని చెప్పడం మూవీ లవర్స్ ఆగ్రహానికి కారణమయ్యింది.
నిజానికి దీని వెనుక పలు కోణాలున్నాయి. లగాన్ తర్వాత ఇదే అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన స్వదేస్ లో షారుఖ్ ఖాన్ నటనకు గాను అప్పట్లో జాతీయ అవార్డు వస్తుందని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. దీని మీద పత్రికల్లో డిబేట్ కూడా నడిచింది. స్వదేస్ కాదని మధుర్ బండార్కర్ తీసిన పేజ్ 3కి ఇవ్వడం పట్ల కొంత వివాదమూ నడిచింది. సరిగ్గా అదే తరహాలో అలాంటి కాంట్రావర్సికి అశుతోష్ తెరలేపారు. ఇప్పటికే మూడు దశాబ్దాల నట జీవితం పూర్తి చేసుకున్న షారుఖ్ కు మళ్ళీ ఛాన్స్ వస్తుందో లేదో అనే తరహాలో కావాలని ఇచ్చినట్టు సోషల్ మీడియాలో తీవ్రమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి.
జ్యురి సభ్యుడు ప్రదీప్ నాయర్ తమ చర్యను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. సాంకేతిక కారణాలతో పాటు పాటలకు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఇవ్వకపోవడం వల్లే అర్హత తగ్గిందని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా గోట్ సహజంగా లేదని చెప్పడం పెద్ద జోక్. ఈ వ్యవహారం మీద గోట్ దర్శకుడు బ్లేస్సి స్పందించాడు. ముంబైలో తమ సినిమా ప్రీమియర్ చూసి అశుతోష్ గోవారికర్ హాలీవుడ్ మూవీ లారెన్స్ అఫ్ అరేబియాతో పోల్చి, తమ టీమ్ ని లంచ్ కి పిలిచాడని, ఇప్పుడు అదే వ్యక్తి ఇలా యు టర్న్ తీసుకుని గోట్ ని తక్కువ చేసి మాట్లాడ్డం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చూస్తుంటే ఈ డిబేట్ అంత సులభంగా ముగిసేలా లేదు.
This post was last modified on August 5, 2025 5:01 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…