గత సినిమాలు ది ఫ్యామిలీ స్టార్, లైగర్ తో పోలిస్తే కింగ్డమ్ మెరుగ్గానే అనిపించుకుంది. అయితే యునానిమస్ టాక్ తెచ్చుకోవడానికి అది సరిపోలేని వైనం కలెక్షన్లలో కనిపిస్తోంది. సోమవారం ఆక్యుపెన్సీలు తగ్గడం సహజమే అయినా ఆశించిన దానికన్నా తక్కువ స్థాయిలో కింగ్డమ్ నెంబర్లు పడిపోవడం అభిమానుల్లో ఖంగారు కలిగిస్తోంది. ఆదివారం మంచి అంకెలు నమోదు చేసినప్పటికీ యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహను ఓవర్ టేక్ చేయలేకపోవడం చూస్తే అన్ని వర్గాలను కింగ్డమ్ మెప్పించలేదనే వాస్తవం తేటతెల్లమవుతోంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో పాటు టీమ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నా పనవ్వడం లేదు.
ముఖ్యంగా సెకండాఫ్ మీద వచ్చిన ఫీడ్ బ్యాక్ కింగ్డమ్ మొత్తం ఫలితాన్ని శాశిస్తోంది. నిర్మాత నాగవంశీ పెట్టుకున్న నమ్మకం పూర్తి స్థాయిలో నెరవేరేలా లేదు. మొదటి రోజు ఓపెనింగ్స్, రివ్యూలు చూసి విజయ్ దేవరకొండకు హిట్టు దక్కిందని సంబర పడ్డ అభిమానులకు ఆ ఆశ అట్టే నిలవలేదు. అయితే ఈ వారం చెప్పుకోదగ్గ పెద్ద రిలీజులు లేకపోవడంతో ఇంకో వీకెండ్ రూపంలో మరో అవకాశం వెయిట్ చేస్తోంది. ఇక్కడ రెండు అడ్డంకులున్నాయి. అతడు రీ రిలీజ్ పెద్ద ఎత్తున ట్రెండయ్యేలా ఉంది. ఖలేజా, మురారి రేంజ్ రెస్పాన్స్ ఉంటే మాత్రం కింగ్డమ్ వారాంతం ఆశలు గల్లంతవుతాయి.
ఇంకోవైపు మహావతార్ నరసింహ అప్పుడు కూడా శాంతించేలా లేదు. థియేటర్లో చూడాలని వెయిట్ చేస్తున్న ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొన్న శని ఆదివారాలు టికెట్లు దొరక్క నిరాశ పడిన సంఖ్య లక్షల్లో ఉంది. వాళ్లంతా నెక్స్ట్ సండే నాడు ఖచ్చితంగా చూస్తారు. సో కింగ్డమ్ కు ఇవి ప్రతిబంధకాలుగా మారతాయి. బ్రేక్ ఈవెన్ కోణంలో చూసుకుంటే అరవై నుంచి డెబ్భై శాతం దాకా రికవరీ ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ అలా జరిగినా ఫైనల్ గా నష్టాలు తప్పవు. ఆగస్ట్ 14 ఎలాగూ వార్ 2, కూలీలు వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు మాత్రం కింగ్డమ్ పూర్తిగా ప్యాకప్ చెప్పాల్సిందే.
This post was last modified on August 5, 2025 12:40 pm
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…