ఎన్టీఆర్‍ది పక్కా మాస్ ఇమేజ్. ఎలాంటి సినిమా చేసినా కానీ మాస్‍ని మెప్పించే అంశాలు కచ్చితంగా వుండాలని ఎన్టీఆర్ జాగ్రత్త పడతాడు. అందుకే త్రివిక్రమ్‍తో చేసిన సినిమా ‘అరవింద సమేత’లో కూడా త్రివిక్రమ్ శైలి కంటే ఎన్టీఆర్ టేస్ట్ ఎక్కువ కనిపించింది. అయితే త్రివిక్రమ్ బలం ఫ్యామిలీ డ్రామా. పవన్‍తో అయినా, అల్లు అర్జున్‍తో అయినా త్రివిక్రమ్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చింది ఫ్యామిలీ చిత్రాలతోనే. మరి వీరిద్దరి కలయికలో వస్తోన్న రెండో సినిమా ఎలాగుండాలి?
ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్.’ తర్వాత పాన్ ఇండియా స్టార్ అవుతాడా? ప్రభాస్‍కి వచ్చినట్టు అతనికీ పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందా? త్రివిక్రమ్‍తో చేసే సినిమా పాన్ ఇండియా మార్కెట్‍ని దృష్టిలో పెట్టుకుని చేయాలా లేక తెలుగు మార్కెట్‍కి మాత్రమే పరిమితం కావాలా లాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ మూడు కథలు సిద్ధం చేసి పెట్టాడట. అయితే ఇందులో ఏది చేస్తే బెస్ట్ అనేదానిపై ఇద్దరికీ పూర్తి క్లారిటీ లేదనే టాక్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్ తప్పకుండా మార్చి నుంచి ఈ సినిమా మొదలు పెట్టేస్తాడంటూ త్రివిక్రమ్‍ను లాక్ చేసారు కానీ అతను అప్పటికి ఫ్రీ అయ్యేదీ లేనిదీ రాజమౌళిపై ఆధార పడివుంది. ఆరు నెలల పాటు అందుబాటులోకి రానని తారక్ చెప్పినట్టయితే వేరే సినిమా చేయాలని త్రివిక్రమ్ భావించాడు కానీ ప్రస్తుతానికి అందుకు సంబంధించిన కార్యకలాపాలు ఏవీ జరగడం లేదని సమాచారం.
This post was last modified on November 19, 2020 5:20 pm
ఇంకో పద్దెనిమిది రోజుల్లో హిట్ 3 ది థర్డ్ కేస్ విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2…
తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation)…
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…