‘మళ్ళీ రావా’ లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాాడు గౌతమ్ తిన్ననూరి. ఫాంలో లేని సుమంత్‌తో ఆ సినిమా తీసి హిట్టు కొట్టడంతో తనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక నానితో చేసిన ‘జెర్సీ’ ఎంత గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుందో తెలిసిందే. ఆ సినిమాతో అతడికి డిమాండ్ పెరిగి.. ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు.
వీరి కలయికలో సినిమాకు దాదాపు అంతా సిద్ధమైనట్లే కనిపించింది. కానీ కొన్ని నెలల ప్రయాణం తర్వాత.. ఈ ప్రాజెక్టును గౌతమ్, చరణ్ క్యాన్సిల్ చేసుకున్నారు. మరి ఏమైందన్నది ఎవరికీ తెలియదు. తర్వాత విజయ్ దేవరకొండతో ‘కింగ్డమ్’ను మొదలుపెట్టాడు గౌతమ్. చరణ్ రిజెక్ట్ చేసిన కథనే విజయ్‌తో గౌతమ్ తీశాడని ఒక టైంలో వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తర్వాత తేలింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో గౌతమ్ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.
చరణ్‌కు తాను చెప్పిన కథ వేరని.. విజయ్‌తో తీసింది వేరే కథ అని అతను స్పష్టం చేశాడు. చరణ్‌తో సినిమా ఎందుకు వర్కవుట్ కాలేదో కూడా అతను వెల్లడించాడు. ముందు గౌతమ్ చెప్పిన ఒక లైన్ నచ్చి చరణ్ సినిమాకు అంగీకారం తెలిపాడట. ఐతే ఆ ఐడియాతో కథను రెడీ చేశాక.. అది చరణ్‌కు కరెక్ట్ కాదని తనకే అనిపించి ఆ కథను ఆపేశానని గౌతమ్ వెల్లడించాడు. చరణ్‌తో సినిమా చేయడం అన్నది గొప్ప అవకాశమని.. ఆ ఛాన్స్ వచ్చింది కదా అని హడావుడిగా ఏదో ఒకటి తీసేయడం కరెక్ట్ కాదనిపించిందని గౌతమ్ తెలిపాడు.
మళ్లీ ఓ మంచి కథ సిద్ధమై, దాని మీద పూర్తిగా సంతృప్తి చెందితే వెళ్లి చరణ్‌తో కచ్చితంగా సినిమా చేస్తానని గౌతమ్ తెలిపాడు. చరణ్‌తో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని.. తరచుగా మాట్లాడుకుంటూ ఉంటామని అతను చెప్పాడు. తన తొలి చిత్రం ‘మళ్ళీ రావా’ కథను విజయ్ దేవరకొండకే చెప్పడానికి ప్రయత్నించానని.. కానీ ‘పెళ్ళిచూపులు’ హిట్టయిన ఉత్సాహంలో విజయ్ ఆ కథ వినలేదని.. తర్వాత చూద్దాం అన్నాడని గౌతమ్ తెలిపాడు.
This post was last modified on August 4, 2025 11:22 pm
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్‌కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…