Movie News

రజినీ చేసిన గొప్ప పని చెప్పిన నాగ్

సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాట చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తుంటారని.. అందుకోసం కోట్లు ఖర్చు పెడుతుంటారని చెబుతుంటారు. ఐతే ఆయన తన సినిమాలకు పని చేసే కాస్ట్ అండ్ క్రూను కూడా ఎంత బాగా చూసుకుంటారో అక్కినేని నాగార్జున వెల్లడించారు. సూపర్ స్టార్ లీడ్ రోల్ చేసిన ‘కూలీ’లో నాగ్ విలన్ పాత్ర చేసిన సంగతి తెలిసిందే. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. రజినీది ఎంత గొప్ప మనసో ఒక ఉదాహరణతో చెప్పాడు నాగ్.

‘కూలీ’ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను బ్యాంకాక్‌లో తెరకెక్కించినట్లు నాగ్ తెలిపాడు. ఒక షిప్ మీద 17 రోజుల పాటు పూర్తిగా నైట్ ఎఫెక్ట్‌లోనే ఈ సీక్వెన్స్ చిత్రీకరణ జరిగిందట. రజినీ కూడా అందులో పాల్గొన్నారని.. చాలా కష్టపడి, భారీ కాస్ట్ అండ్ క్రూతో ఈ సీక్వెన్స్ చేశామని నాగ్ వెల్లడించాడు. ఐతే మొత్తం చిత్రీకరణ పూర్తయ్యాక.. రజినీకాంత్ టీంలో అందరినీ పిలిచి వాళ్ల చేతుల్లో ఒక ప్యాకెట్ పెట్టారని నాగ్ తెలిపాడు. మొత్తం 350 మందికి తలో ప్యాకెట్ ఇచ్చారని.. అందులో డబ్బులు ఉన్నాయని.. వాటితో పిల్లల కోసం బ్యాంకాక్‌లో ఏమైనా కొనుక్కుని వెళ్లాలని రజినీ చెప్పినట్లు నాగ్ తెలిపారు.

రజినీ ఇలా చేయాల్సిన అసవరం లేదని.. కానీ అంత మందికి సాయం చేసి తన పెద్ద మనసును రజినీ చాటుకున్నారని నాగ్ కొనియాడారు. రజినీతో ఈ సినిమా చేయడం తనకు మరపు రాని అనుభవమన్న నాగ్.. ఇందులో తనది విలన్ పాత్రే అయినా.. హీరో స్థాయిలో ఉంటుందని చెప్పాడు. రజినీ ఈ స్క్రిప్టు విని ఎలా అంగీకరించారా అని తాను ఆశ్చర్యపోయినట్లు నాగ్ తెలిపాడు. ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్ పాత్ర మైండ్ బ్లోయింగ్‌గా ఉ:టుందని.. అతను అందరినీ జేబులో పెట్టుకుని వెళ్లిపోతాడని నాగ్ వ్యాఖ్యానించాడు.

This post was last modified on August 4, 2025 11:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆర్జీవీ మీద ఇంత గౌరవమా?

రామ్ గోపాల్ వ‌ర్మ అంటే ఒక‌ప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్ట‌ర్. శివ‌, రంగీలా, స‌త్య‌, కంపెనీ, స‌ర్కార్…

24 minutes ago

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

3 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

5 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

7 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

10 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

11 hours ago