Movie News

తారక్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా హృతిక్ కామెంట్

మన హీరోల గొప్పదనం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అందులో ప్రత్యేకత ఏమీ ఉండదు. వేరే ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు మన హీరోలను కొనియాడితే.. అది ఫ్యాన్స్‌కు మాంచి కిక్ ఇస్తుంది. బాలీవుడ్లో టాప్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్.. మన జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రశంసలు కురిపించేసరికి తన ఫ్యాన్స్ చాలా ఖుషీ అయిపోతున్నారు.

ఎన్టీఆర్‌ను అందరూ ఏకసంతాగ్రాహి అని.. డైలాగ్ అయినా, ఒక డ్యాన్స్ మూమెంట్ అయినా.. పెద్దగా ప్రాక్టీస్ చేయకుండానే ఈజీగా లాగించేస్తాడని టాలీవుడ్‌లో తనతో కలిసి పని చేసిన వాళ్లందరూ చెబుతుంటారు. ఇప్పుడు ఇదే మాటను హృతిక్ కూడా చెప్పడమే ఫ్యాన్స్ సంబరానికి కారణం. ‘వార్-2’లో తారక్‌తో కలిసి హృతిక్ పని చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్లలో వీళ్లిద్దరూ ఉంటారు. ఇలాంటి టాప్ డ్యాన్సర్లు కలిసి ఒక పాట కోసం స్టెప్పులు వేశారు. ఈ సాంగ్ సినిమాకు హైలైట్ అవుతుందని భావిస్తున్నారు.

ఈ పాట గురించి స్పందిస్తూ.. ఎన్టీఆర్ స్పెషల్ టాలెంట్ గురించి హృతిక్ ప్రస్తావించాడు. తాను ఇప్పటిదాకా పని చేసిన కోస్టార్లలో.. అసలు రిహార్సల్సే లేకుండా స్టెప్పులేసే ఏకైక హీరో తారకే అని హృతిక్ కొనియాడాడు. అతను ఏమాత్రం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదని.. డ్యాన్స్ మూమెంట్స్ ఇన్‌బిల్ట్‌గా తన బాడీలో ఉంటాయని హృతిక్ అన్నాడు.

తారక్‌లోని ఈ ప్రతిభ చూసి తాను ఆశ్చర్యపోయినట్లు.. తనతో కలిసి పని చేయడాన్ని ఎంతో ఆస్వాదించినట్లు హృతిక్ తెలిపాడు. మరి ఈ టాప్ డ్యాన్సర్లు ఇద్దరూ కలిసి చేసిన పాటలో ఎంత ఊపు ఉంటుందో.. రేప్పొద్దున థియేటర్లను ఈ సాంగ్ ఎలా షేక్ చేస్తుందో చూడాలి. ‘వార్-2’ ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

This post was last modified on August 4, 2025 10:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నా పేరెంట్స్ మీటింగ్ కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు – లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 minutes ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

55 minutes ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

58 minutes ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

1 hour ago

అమెరికా కొంటే తప్పులేదు.. భారత్ కొంటే తప్పా?

ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…

1 hour ago

ఇండిగో దెబ్బకు డీజీసీఏ యూ టర్న్!

ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్‌కు…

1 hour ago