మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో విడుదల కావడం కొత్త కాదు కానీ ఒక పాత మూవీని ఫ్రెష్ గా రిలీజ్ చేయడం అరుదు. అలాంటి ఘనతను మనం దక్కించుకోనుంది. పదకొండు సంవత్సరాల క్రితం 2014లో రిలీజైన మనంలో అక్కినేని హీరోలందరూ నటించారు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ టిపికల్ స్క్రీన్ ప్లేని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పడంతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా ఏఎన్ఆర్ చివరి చిత్రంగా దీంతో ఫ్యాన్స్ కి ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఆ మధ్య పరిమితంగా మళ్ళీ విడుదల చేస్తే హైదరాబాద్ లో పలు చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి.
ఇదిలా ఉండగా మనం ఆగస్ట్ 8 జపాన్ లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. నాగార్జునకు అక్కడ ఇమేజ్ ఉంది. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 తర్వాత తనను అక్కడి ఫ్యాన్స్ నాగ్ సామ అని పిలుచుకుంటున్నారు. సామ అంటే అక్కడి భాషలో అన్నయ్య, దేవుడు, కావాల్సినవాడు అని అర్థం. అప్పటి నుంచి రకరకాలుగా తమ అభిమానాన్ని నాగ్ మీద చూపిస్తూనే ఉంటారు. అందుకే మనం వాళ్లకు బాగా కనెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో అక్కడి ఆడియన్స్ కోసం థియేటర్లకు తీసుకొస్తున్నారు. రిలీజ్ రోజు నాగార్జున వర్చువల్ వీడియో కాల్ ద్వారా జపాన్ అభిమానులతో ముచ్చటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఇండియన్ మూవీస్ కి జపాన్ లో డిమాండ్ పెరిగింది. విజువల్ ఎఫెక్ట్స్ నిండినవి కాకుండా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న వాటికి పట్టం కడుతున్న వైనం వసూళ్లలో కనిపిస్తోంది. ముత్తు సక్సెస్ కు కారణం అదే. భావోద్వేగాలు పుష్కలంగా ఉండే మనం ఖచ్చితంగా జపాన్ జనాలకు కనెక్ట్ అవుతుందని బయ్యర్ల నమ్మకం. ఒకవేళ ఇది కనక వర్కౌట్ అయితే భవిష్యత్తులో మరిన్ని నాగ్ మూవీస్ జపాన్ కు వెళ్లిపోతాయి. మనంకే ఇలా అయితే నువ్వు వస్తావని, నిన్నే పెళ్లాడతా, హలో బ్రదర్ లాంటి ఆల్ టైం సూపర్ హిట్స్ కి ఇంకేమవుతారో చూడాలి. మొత్తానికి నాగ్ సామ జోరు మాములుగా లేదు.
This post was last modified on August 2, 2025 6:19 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…