జాతీయ అవార్డులు ప్రకటించినపుడల్లా.. కొన్ని పురస్కారాల విషయంలో విమర్శలు రావడం, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం మామూలే. ఈ పురస్కారాల్లో అందరూ అమితాసక్తిని ప్రదర్శించేది ఉత్తమ నటుడి విషయంలోనే. కొన్నిసార్లు ఆ పురస్కారం సరైన నటుడికే దక్కిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. కొన్నిసార్లు అభ్యంతరాలు తప్పవు. ఈసారి జవాన్ సినిమాకు గాను షారుఖ్ ఖాన్‌కు అవార్డు ఇవ్వడం పట్ల ఎక్కువ వ్యతిరేకతే వస్తోంది. షారుఖ్ గొప్ప నటుడనడంలో సందేహం లేదు. జాతీయ అవార్డు ఇవ్వాల్సి ఉండి, ఇవ్వని పాత్రలు తన కెరీర్లో ఉన్నాయి. కానీ జవాన్ లాంటి సగటు కమర్షియల్ సినిమాలో ఆయన అంత గొప్పగా నటించాడు అనడానికి ఏమీ లేదు. ఇలాంటి పెర్ఫామెన్సులు షారుఖ్ నుంచి బోలెడు చూశాం. పోటీలో ఎన్నో గొప్ప పెర్ఫామెన్సులు ఉండగా.. జవాన్‌లో విజయ్ పాత్రకు గాను షారుఖ్‌కు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం ఇవ్వడం పట్ల ఎక్కువగా వ్యతిరేకతే వస్తోంది.
గత ఏడాది కాలంలో వివిధ భాషల్లో అద్భుతం అనిపించే లీడ్ పెర్ఫామెన్సులు చాలానే ఉన్నాయి. వాటిలో ముందు చెప్పుకోవాల్సింది ది గోట్ టైఫ్: ఆడుజీవితంలోని పృథ్వీరాజ్ సుకుమారన్ పెర్ఫామెన్స్ గురించే. ఇందులో నజీబ్ అనే పాత్రలో మామూలుగా నటించలేదు పృథ్వీరాజ్.ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ మోసపోయి బానిస బతుకు అనుభవించి.. అక్కడి నుంచి తప్పించుకుని ఎడారిలో నానా కష్టాలు పడి.. మృత్యు అంచులదాకా వెళ్లి చివరికి అక్కడ్నుంచి బయటపడ్డ ఒక సాధారణ వ్యక్తి కథ ఇది. పృథ్వీరాజ్ నాలుగేళ్లకు పైగా సమయం వెచ్చించి ఈ చిత్రం కోసం పడ్డ కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏకంగా 31 కిలోల బరువు తగ్గి.. చిక్కి శల్యమైన రూపంలో తెరపై కనిపించడం వెనుక ఎంత కష్టం దాగి ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక నజీబ్ పాత్రలో పరిణామ క్రమాన్ని తెరపై కళ్లకు కట్టేలా చూపిస్తూ పృథ్వీరాజ్ అందులో జీవించిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. మనకూ ఓ టామ్ హాంక్స్ ఉన్నాడని గర్వంగా చెప్పుకునేలా ఆ పాత్రను పోషించాడు. కొన్ని సన్నివేశాల్లో పృథ్వీరాజ్ అభినయానికి కన్నీళ్లు రాకుండా మానవు. అసలు ఒక స్టార్ హీరోను చూస్తున్నామనే ఫీలింగే రానివ్వకుండా ఒక అభాగ్యుడి పాత్రను పండించిన విధానానికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. ఈ పాత్రలో నటనకు పృథ్వీరాజ్ కచ్చితంగా జాతీయ అవార్డు అందుకోవాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తంగలాన్ సినిమాలో విక్రమ్ సైతం నేషనల్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫామెన్సే ఇచ్చాడు. కానీ పృథ్వీరాజ్ నటన దాన్ని మించినదే. కానీ వీళ్లిద్దరినీ కాదని జవాన్ సినిమాకు గాను షారుఖ్‌కు అవార్డు ఇవ్వడం అన్యాయమనే చెప్పాలి.
This post was last modified on August 2, 2025 8:41 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…