కొత్త నెల వచ్చేసింది. ఒక హిట్టు అయిదు ఫ్లాపులుగా సాగుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఆగస్ట్ కొత్త జోష్ తీసుకొస్తుందని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. పేరుకి కింగ్డమ్ రిలీజయ్యింది జూలై అయినా గ్యాప్ ఒక్క రోజే కాబట్టి దాన్ని కూడా ఈ కోటాలో కలిపేసుకోవచ్చు. విజయ్ సేతుపతి – నిత్య మీనన్ ‘సార్ మేడమ్’ టాక్ మీద ఆధారపడి ఆడియన్స్ ని ఆకట్టుకుంటామనే నమ్మకంతో ఇవాళ థియేటర్లలో పరుగు పెట్టింది. దీంతో పాటు ఉసురే, థాంక్ యు డియర్ అనే మరో రెండు చిన్న సినిమాలతో పాటు బాలీవుడ్ మూవీస్ సన్నాఫ్ సర్దార్ 2, ధఢక్ 2 ఆడియన్స్ తీర్పు కోసం వచ్చేశాయి. ఇవన్నీ పూర్తిగా టాక్ ని నమ్ముకుని దిగుతున్నవే.
ఆగస్ట్ 8 వస్తున్న ‘బకాసుర రెస్టారెంట్’ వెరైటీ ప్రమోషన్ల బజ్ పెంచుకునే పనిలో ఉంది. దీనికన్నా ఎక్కువగా మరుసటి రోజు వచ్చే ‘అతడు’ని సెలెబ్రేట్ చేసుకునేందుకు మహేష్ బాబు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. అసలైన కిక్ ఆగస్ట్ 14 రానుంది. జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ ‘వార్ 2’ భారీ రిలీజ్ కు రంగం సిద్ధం చేసుకుంటోంది. సితార డిస్ట్రిబ్యూషన్ కావడంతో స్ట్రెయిట్ మూవీకి దీటుగా ప్లానింగ్ జరుగుతోంది. అదే రోజు రజనీకాంత్ ‘కూలీ’ ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో ఊహాకందడం లేదు. తమిళంలోనే కాదు తెలుగులోనూ క్రేజీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. టాక్ బాగుంటే జైలర్ ని పెద్ద మార్జిన్ తో దాటేస్తుంది.
ఆగస్ట్ 22 అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’ని తీసుకొస్తున్నారు. వెరైటీ పబ్లిసిటీ ద్వారా జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే రోజు నరేష్ అగస్త్య ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’ను రిలీజ్ చేస్తున్నారు. వీటితో పాటు చిరు బర్త్ డే సందర్భంగా ‘స్టాలిన్’ ఫోర్కె రీ రిలీజ్ కు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్ 27 రవితేజ ‘మాస్ జాతర’ వస్తుందో రాదోననే అనుమానాలు ఇంకా తొలగలేదు. అయితే నారా రోహిత్ ‘సుందరకాండ’ ఆ డేట్ ని లాక్ చేసేసుకుంది. రెండు రోజుల గ్యాప్ తో ఆగస్ట్ 29 కీర్తి సురేష్ ‘రివాల్వర్ రీటా’తో పాటు జాన్వీ కపూర్ ‘పరం సుందరి’ ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. మొత్తానికి ఆగస్ట్ నెల సందడి సందడిగా ఉండబోతోంది.
This post was last modified on August 1, 2025 12:24 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…