తాజాగా విడుదలైన కింగ్డమ్ భారీ ఓపెనింగ్స్ తో మొదలయ్యింది. టాక్, రివ్యూల సంగతి పక్కనపెడితే విజయ్ దేవరకొండ బ్రాండ్ తో పాటు గౌతమ్ తిన్ననూరి ఇమేజ్, అనిరుద్ రవిచందర్ సంగీతం బాగా ప్లస్ అయ్యాయి. అయితే ఫ్యాన్స్ కి టీమ్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. యూట్యూబ్ లో 15 మిలియన్లకు పైగా వ్యూస్ తెచ్చుకున్న హృదయం లోపల సాంగ్ ని ఎడిటింగ్ లో తీసేశారు. సెకండాఫ్ లో ఎక్కడైనా వస్తుందేమోనని అభిమానులు ఎదురు చూశారు కానీ రాలేదు. నిజానికి కథలో ఉన్న సీరియస్ నెస్ వల్ల బలవంతంగా ఇరికిస్తే ఇంకాస్త మైనస్ అయ్యేది కానీ ఒకరకంగా చెప్పాలంటే ఎడిట్ చేయడమే మంచిదయ్యింది.
తర్వాత జోడించే అవకాశాలు తక్కువే. ఇది ముందే గుర్తించి కాబోలు ఫుల్ వీడియో సాంగ్ ని రెండు నెలల క్రితమే అఫీషియల్ గా అప్లోడ్ చేశారు. అనిరుద్ కంపోజ్ చేసిన ఈ స్మూత్ మెలోడీ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంది. ఫ్లో ప్రకారం చూసుకుంటే అన్నదమ్ముల బాండింగ్ మీద ఎక్కువగా నడిచిన ఈ సినిమాలో ప్రేమకు పెద్దగా చోటు దక్కలేదు. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సేల మధ్య లవ్ స్టోరీకి స్కోప్ ఉన్నా గౌతమ్ తిన్ననూరి వాడుకోలేదు. ఆ మాటకొస్తే ట్రైలర్ లో చూపించిన కొన్ని షాట్లు, టీజర్ లో తగలబెట్టేస్తా అనే సీన్ మెయిన్ మూవీలో లేవు. దీనికి సమాధానం గౌతమ్, నవీన్ నూలి దగ్గరే ఉంటుంది.
ఇది కాసేపు పక్కనపెడితే మిస్టర్ బచ్చన్ తరహాలో భాగ్యశ్రీ బోర్సేకు ఎక్కువ స్కోప్ దక్కలేదు. కథా గమనం వల్ల కొంత భాగానికి మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. కాకపోతే ఇద్దరి మధ్య షూట్ చేసిన కొన్ని సీన్లు, ప్రేమకథ కోతకు గురైనట్టు తెలిసింది. మళ్ళీ రావా, జెర్సీకి భిన్నంగా ఈసారి మాస్ సీరియస్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్న గౌతమ్ తిన్ననూరి మొదటిసారి హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీని ఇంత తక్కువగా చూపించింది కింగ్డమ్ లోనే. ఇంకా రెండో భాగం ఉందంటున్నారు కానీ ఫైనల్ బాక్సాఫీస్ రన్ ముగిశాక నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి. ప్రస్తుతానికి బాక్సాఫీస్ జోరు బాగానే ఉంది.
This post was last modified on July 31, 2025 4:55 pm
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్‌కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…