ఒక ఏడాది క్రితం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ టీజర్ రిలీజైన విషయం ఫ్యాన్స్ కి గుర్తుండే ఉంటుంది. సరే వచ్చింది కదా సినిమా విడుదల దగ్గర్లోనే ఉంటుందని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే నెలలు గడిచిపోయాయి కానీ టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సుమారు నాలుగేళ్లుగా నిర్మాణంలో ఉంది. దీనికన్నా చాలా ఆలస్యంగా సాయిశ్రీనివాస్ సంతకం చేసిన వాటిలో భైరవం ఆల్రెడీ వచ్చేయగా కిష్కిందపురి సెప్టెంబర్ మూడో వారంలో రానుంది. కానీ టైసన్ నాయిడు వ్యవహారం ఎటూ తేలడం లేదు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం అఖండ 2 మీదే టైసన్ నాయుడు భారం వేశాడట. ఎందుకంటే రెండు సినిమాల నిర్మాతలు 14 రీల్స్ కావడంతో బాలయ్య మూవీ బిజినెస్ టైంలో రెండూ ఒక ప్యాకేజీగా ఇవ్వాలనే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అఖండ 2కి విపరీతమైన డిమాండ్ ఉన్న దృష్ట్యా ఇదేమి పెద్ద సమస్య కాదు. పైగా సాయిశ్రీనివాస్ కు వ్యక్తిగతంగా ఉన్న మార్కెట్ ఎలాగూ థియేటర్ రెవిన్యూ తీసుకొస్తుంది. కాకపోతే టాలీవుడ్ కు చాలా గ్యాప్ తీసుకోవడం, భైరవం నిరాశపరచడం లాంటివి మార్కెట్ మీద కొంత ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఇక్కడ ప్రమోషన్ కంటెంట్ కీలక పాత్ర పోషించనుంది.
టైసన్ నాయుడులో సాయిశ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. పాయింట్ కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారట. బడ్జెట్ ఎక్కువ కావడం వల్లే ఆర్థికంగా కొన్ని చిక్కులు వచ్చాయనే టాక్ లేకపోలేదు. దీని వల్లే సాగర్ కె చంద్ర ఏళ్ళ తరబడి ఈ ప్రాజెక్టు మీదే వర్క్ చేస్తున్నారు. నభ నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చడం విశేషం. ఇన్ని ఆకర్షణలు ఉన్నా ఇంత ఆలస్యం కావడం విచిత్రమే. సాయిశ్రీనివాస్ చేసిన ఛత్రపతి హిందీ రీమేక్ కూడా ఈ పరిస్థితికి కారణమని చెప్పొచ్చు. ఎటు చూసినా ఈ ఏడాదిలోనే టైసన్ నాయుడుకి మోక్షం దక్కేలా ఉందని యూనిట్ టాక్.
This post was last modified on July 30, 2025 3:48 pm
సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా మహేంద్రగిరి వారాహి మీద విడుదలకు ముందు మంచి అంచనాలే…
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…