తెర మీద పాత్రలు ఒకరినొకరు చితగ్గొట్టేసుకున్నట్లు చూపిస్తారు కానీ.. అదంతా అబద్ధం అని అందరికీ తెలుసు. పాత్రలో లీనమై నటించే క్రమంలో కొన్ని సందర్భాల్లో మాత్రం అవతలి వాళ్లను నిజంగానే కొట్టేయడం జరుగుతుంటుంది. కానీ సన్నివేశం సహజంగా అనిపించడం కోసం ఒక నటిని ఒక హీరో 15 సార్లు చెంపదెబ్బ కొట్టాడంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ పని సీనియర్ హీరో అక్కినే నాగార్జున చేశాడట. ‘చంద్రలేఖ’ సినిమాలో కథానాయికగా నటించిన బాలీవుడ్ భామ ఇషా కొప్పికర్‌ను ఆయన అన్నిసార్లు లెంపకాయ కొట్టాడట. ఈ విషయాన్ని స్వయంగా ఇషానే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
‘చంద్రలేఖ’లో ఒక సన్నివేశంలో నాగార్జున.. ఇషాను చెంపదెబ్బ కొడతాడన్న సంగతి తెలిసిందే. ఐతే ఆ సన్నివేశం సహజంగా రావడం కోసం చాలాసార్లు రీటేక్ చేయాల్సి వచ్చిందట. నాగ్.. సుతారంగా చెంపదెబ్బ కొడుతుంటే, తనకు దెబ్బ తిన్న ఫీలింగే రాలేదని ఇషా చెప్పింది. అవతలి వ్యక్తి లెంపకాయ కొట్టినపుడు ముఖంలో కోపం రావాలని.. ఆ ఎక్స్‌ప్రెషన్ కోసమే దర్శకుడు కృష్ణవంశీ అడుగుతున్నాడని.. కానీ తాను మాత్రం అది ఇవ్వలేకపోయానని ఇషా చెప్పింది.
తనను నిజంగానే చెంపదెబ్బ కొట్టమని నాగ్‌ను అడిగితే, ఆయన అలా చేయలేనని చెప్పాడని.. ఆయన మెల్లగా కొడుతుంటే తనకు దెబ్బ తిన్న ఫీలింగ్ రాక, ఎక్స్‌ప్రెషన్ సరిగా ఇవ్వలేకపోయానని ఇషా చెప్పింది. ఇలా 15 సార్లు తాను నాగ్ దగ్గర చెంపదెబ్బ తిన్నానని.. చివరికి గట్టిగా కొట్టడంతో ఆ ఫీల్ వచ్చి సరైన ఎక్స్‌ప్రెషన్ ఇవ్వగలిగానని ఇషా తెలిపింది. తనను గట్టిగా కొట్టాక నాగ్ వచ్చి సారీ చెప్పాడని.. ఐతే అది తాను కోరుకున్నదే కాబట్టి, సారీ ఎందుకు అని వారించానని ఇషా తెలిపింది. ఓ మలయాళ హిట్ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ‘చంద్రలేఖ’ ఫ్లాప్ అయింది. దీంతో ఇషా తెలుగులో మళ్లీ కథానాయికగా ఇంకో సినిమా చేయలేదు. చాలా ఏళ్ల తర్వాత నిఖిల్ మూవీ ‘కేశవ’లో ఆమె ఒక ప్రత్యేక పాత్ర పోషించింది.
This post was last modified on July 30, 2025 1:24 pm
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…