కన్నడ నటి రమ్యకు దర్శన్ అభిమానుల నుంచి వస్తున్న బెదిరింపులు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. తనను సోషల్ మీడియాలో చాలా అసభ్యంగా తిడుతున్నారంటూ ఆవిడ ఇచ్చిన కంప్లయింట్ పట్ల పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. స్టార్ హీరో దర్శన్ చేతిలో హత్యకు గురైన రేణుకస్వామి కేసు గురించి ఇటీవలే రమ్య పెట్టిన పోస్టుకి అతని ఫ్యాన్స్ అతిగా స్పందించారు. ఏకంగా చంపే స్థాయిలో బెదిరింపులకు దిగారు. బెయిలు మీదున్న దర్శన్ ప్రస్తుతం షూటింగ్స్ రీ స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. దీని మీద కొందరు కోర్టుకు వెళ్లగా ఇందుకు సంబంధించిన వాదోపవాదాలు ఇంకా జరగాల్సి ఉంది.
ఇదిలా ఉండగా రమ్య మీద జరుగుతున్న దాడిని సీనియర్ స్టార్ శివరాజ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. గౌరవించాల్సిన ఆడవాళ్ళ పట్ల ప్రవర్తించే తీరు ఇది కాదని, ఎట్టి పరిస్థితుల్లో వీటిని సహించేది లేదని, రమ్యకు తాను బాసటగా ఉంటానని ప్రకటించారు. సామాజిక మాధ్యమాలను ఇలా దుర్వియోగం చేసే వాళ్ళు ఎవరైనా సరే శిక్షకు అర్హులవుతారని పేర్కొన్నారు. ఈ మధ్య థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్ హాసన్ కు సపోర్ట్ చేసినందుకు శివరాజ్ కుమార్ మీద కూడా ట్రోలింగ్ జరిగింది. దానికి బాధితుడిగా ఉన్న శివన్న ఇప్పుడు రమ్యకు మద్దతుగా నిలవడం పట్ల మూవీ లవర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ పెద్దిలో నటిస్తున్న శివరాజ్ కుమార్ శాండల్ వుడ్ లో అత్యంత అనుభవమున్న సీనియర్ స్టార్. ఆయనకే ఇబ్బందులు తప్పలేదంటే రమ్యలాంటి వాళ్లకు ఎదురు కావడంలో ఆశ్చర్యం లేదు. గతంలో రాజకీయాల్లో ఉండి, అంతకు ముందు టాప్ హీరోయిన్ గా వెలిగిన రమ్యకు జరిగింది చూసి ఇతర నటీనటులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడీ ఘటన పుణ్యమాని దర్శన్ మీద మరింత వ్యతిరేకత పెరుగుతోంది. స్వంత అభిమానిని చంపిన కేసులో చక్కగా బయట తిరుగుతున్న ఇతన్ని మళ్ళీ కటకటాలు పంపాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో.
This post was last modified on July 29, 2025 6:54 pm
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేస్తుందని వారు…
ఒక బాలీవుడ్ మూవీ మూడో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఎన్ని నెలలయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం.…
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…